Share News

High Court: స్థానిక సంస్థల ఉప ఎన్నికలపై కౌంటర్‌ దాఖలు చేస్తాం

ABN , Publish Date - Jan 31 , 2025 | 05:17 AM

వివిధ కారణాలతో ఖాళీగా ఉన్న జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచి, వార్డు సభ్యుల పదవులకు ఉపఎన్నికలు నిర్వహించే అంశంపై కౌంటర్‌ దాఖలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది.

High Court: స్థానిక సంస్థల ఉప ఎన్నికలపై కౌంటర్‌ దాఖలు చేస్తాం

  • హైకోర్టుకు తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం

  • పాత పిటిషన్‌పై విచారణ

హైదరాబాద్‌, జనవరి 30 (ఆంధ్రజ్యోతి): వివిధ కారణాలతో ఖాళీగా ఉన్న జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచి, వార్డు సభ్యుల పదవులకు ఉపఎన్నికలు నిర్వహించే అంశంపై కౌంటర్‌ దాఖలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. ఖాళీగా ఉన్న స్థానిక సంస్థల పదవులకు పంచాయతీరాజ్‌ శాఖ ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు తీసుకోవడం లేదని పేర్కొంటూ 2023 మార్చి 6న హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. తాజాగా ఈ పిటిషన్‌ తాత్కాలిక చీఫ్‌ జస్టిస్‌ ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది.


కౌంటర్‌ దాఖలు చేయడానికి పంచాయతీరాజ్‌ శాఖ తరఫు న్యాయవాది మరో మూడువారాలు సమయం ఇవ్వాలని కోరారు. దీంతో విచారణ మార్చి 5కు వాయిదా పడింది. మొత్తం స్థానిక సంస్థల పాలకవర్గాల గడువు తీరిపోవడంతో ప్రస్తుతం ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతుండటం గమనార్హం. రాష్ట్రవ్యాప్తంగా అన్ని స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగాల్సి ఉంది.

Updated Date - Jan 31 , 2025 | 05:18 AM