Share News

Special Trains: సంక్రాంతి నేపథ్యంలోకాకినాడకు 6 ప్రత్యేక రైళ్లు

ABN , Publish Date - Jan 02 , 2025 | 04:02 AM

సంక్రాంతి పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకొని వివిధ రైల్వేస్టేషన్ల నుంచి కాకినాడకు 6 ప్రత్యేకరైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

Special Trains: సంక్రాంతి నేపథ్యంలోకాకినాడకు 6 ప్రత్యేక రైళ్లు

  • నేటి నుంచి రిజర్వేషన్‌ బుకింగ్‌ ప్రారంభం

హైదరాబాద్‌ సిటీ/హైదరాబాద్‌, జనవరి 1(ఆంధ్రజ్యోతి): సంక్రాంతి పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకొని వివిధ రైల్వేస్టేషన్ల నుంచి కాకినాడకు 6 ప్రత్యేకరైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ నెల 9 నుంచి 12వ తేదీవరకు ప్రత్యేక రైళ్లు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని సీపీఆర్వో శ్రీధర్‌ తెలిపారు. ఈ నెల 9, 11 తేదీల్లో కాచిగూడ - కాకినాడ టౌన్‌(07653), 10, 12 తేదీల్లో కాకినాడటౌన్‌- కాచిగూడ(07654), 10న నాంపల్లి-కాకినాడ టౌన్‌(07023), 11న కాకినాడ-నాంపల్లి(07024) ప్రత్యేక రైళ్లు నడుస్తాయని వెల్లడించారు. ఈ రైళ్లకు గురువారం ఉదయం 8గంటల నుంచి అడ్వాన్స్‌ రిజర్వేషన్‌ బుకింగ్‌ ప్రారంభమవుతుందని వెల్లడించారు.

Updated Date - Jan 02 , 2025 | 04:02 AM