Srushti fertility centre : సృష్టి కేసులో SIT దర్యాప్తు ముమ్మరం, నిందితులను మరోసారి కస్టడీకి ఇవ్వాలని పిటిషన్
ABN , Publish Date - Sep 01 , 2025 | 11:08 AM
హైదరాబాద్‌లోని సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో SIT దర్యాప్తు ముమ్మరమైంది. ఇప్పటికే 9 కేసులు నమోదు చేసిన సిట్.. నిందితులను మరోసారి కస్టడీకి ఇవ్వాలని ఇవాళ పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితురాలు డాక్టర్ నమ్రతతో సహా 27 మంది ఇప్పటికి అరెస్ట్ అయ్యారు.
హైదరాబాద్, సెప్టెంబరు 1 : హైదరాబాద్‌లోని సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో SIT దర్యాప్తు ముమ్మరమైంది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే 9 కేసులు నమోదు చేసిన సిట్.. నిందితులను మరోసారి కస్టడీకి ఇవ్వాలని ఇవాళ పిటిషన్ దాఖలు చేసింది. కాగా, సరోగసీ ముసుగులో శిశు విక్రయాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ కేంద్రంపై పోలీసులు 9 వేర్వేరు కేసులు నమోదు చేశారు.
ఈ కేసులో ప్రధాన నిందితురాలు డాక్టర్ నమ్రతతో సహా 27 మంది అరెస్ట్ అయ్యారు. ఈ కేసులో కీలక నిందితులైన డాక్టర్ నమ్రత, ఆమె కుమారుడు జయంత కృష్ణ, సదానందం, చెన్నారావులను 2 రోజులు పోలీసు కస్టడీ కోరుతూ న్యాయస్థానంలో పిటిషన్ సిట్ ఇవాళ పిటిషన్ దాఖలు చేసింది.
కాగా, తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సృష్టి ఫెర్టిలిటీ సరగసి మోసం కేసును సికింద్రాబాద్ గోపాలపురం పోలీసులు.. స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్ (సిట్)కు బదిలీ చేసిన సంగతి తెలిసిందే. నమ్రత నడిపిన సరగసి దందాలో ఎవరెవరి పాత్ర ఏమిటనే విషయాలపై సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. కేసును పూర్తిగా స్టడీ చేసి, ఓ అంచనాకు వచ్చిన సిట్ అధికారులు తమ దర్యాప్తును విశాఖలో సృష్టి ఫెర్టిలిటీ కేంద్రం నుంచి ప్రారంభించారు.
ఇతర రాష్ట్రానికి చెందిన దంపతుల నుంచి శిశువులను కొనుగోలు చేసింది మొదలు.. వారితో నమ్రతకు ఉన్న సంబంధాలపైనా కూపీ లాగుతున్నారు. ఇప్పటి వరకు సుమారు 80 మంది చిన్నారులను విక్రయించేలా ఆమె సిద్ధం చేసుకున్న నెట్‌వర్క్‌పై పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. అంతేకాకుండా ఇప్పటి వరకు నమ్రత మీద తెలుగు రాష్ట్రాల్లో నమోదైన 10కి పైగా కేసుల వివరాలను సిట్ అధికారులు తెప్పించుకునున్నట్లు తెలిసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
సీఎం చంద్రబాబు.. నవ్యాంధ్ర ప్రగతికి తొలిబాట వేసిన కార్యశూరుడు: ధూళిపాళ్ల నరేంద్ర
మంత్రి నారా లోకేష్‌కు మరో అరుదైన గౌరవం
For More AP News And Telugu News