Share News

బావ పేరిట 30 లక్షల లోన్‌తో పొక్లెయిన్‌

ABN , Publish Date - Feb 18 , 2025 | 03:46 AM

అమీన్‌పూర్‌లో ఇన్సూరెన్స్‌ డబ్బులతో పాటు పొక్లెయిన్‌ను సొంతం చేసుకునేందుకు సొంత బావను హత్య చేసిన బావమరిది కేసులో విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయి.

బావ పేరిట 30 లక్షల లోన్‌తో పొక్లెయిన్‌

  • అలాగే పాలసీ తీసుకొని నామినీగా తన పేరు

  • ఆ డబ్బు, పొక్లెయినర్‌ కోసం బావ హత్య..

  • పోలీసుల అదుపులో బావమరిది

అమీన్‌పూర్‌, ఫిబ్రవరి 17 (ఆంధ్రజ్యోతి): అమీన్‌పూర్‌లో ఇన్సూరెన్స్‌ డబ్బులతో పాటు పొక్లెయిన్‌ను సొంతం చేసుకునేందుకు సొంత బావను హత్య చేసిన బావమరిది కేసులో విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయి. సోమవారం నిందితుడు నరేశ్‌ను అతని మేనమామ దేవీసింగ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు వివరాలు వెల్లడించారు. నరేశ్‌ తన బావ పేరిట రూ.30 లక్షల లోన్‌ తీసుకుని పొక్లెయిన్‌ కొనుగోలు చేయడంతో పాటు దానికి రిస్క్‌ ఇన్సూరెన్స్‌ చేయించాడని, అలాగే రూ.29 లక్షల పోస్టల్‌ పాలసీ తీసుకుని తన పేరును నామినీగా చేర్చుకున్నాడని పోలీసులు తెలిపారు. అతడు మరణిస్తే పొక్లెయిన్‌తో పాటు ఇన్సూరెన్స్‌ డబ్బులను సొంతం చేసుకోవచ్చని హత్యకు పథకం రచించాడని తెలిపారు.


పథకంలో భాగంగా శనివారం గోపాల్‌నాయక్‌ను అమీన్‌పూర్‌ శివారులోకి తీసుకెళ్లి మేనమామ దేవీసింగ్‌తో కలిసి గొంతునులిమి హతమార్చాడని వెల్లడించారు. అనంతరం గోపాల్‌నాయక్‌ మద్యం తాగి అనారోగ్యంతో చనిపోయినట్లు కుటుంబసభ్యులను నమ్మించాడని తెలిపారు. అయితే మెడ చుట్టూ కమిలిన గాయాలను చూసి గోపాల్‌నాయక్‌ కుటుంబసభ్యులు ఫిర్యాదు చేయడంతో నరేశ్‌ గుట్టు రట్టయిందన్నారు. నరేశ్‌తో పాటు దేవీసింగ్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.

Updated Date - Feb 18 , 2025 | 03:46 AM