Share News

Server Issues: ఎప్‌సెట్‌ అభ్యర్థులకు ‘సర్వర్‌’ కష్టాలు!

ABN , Publish Date - May 04 , 2025 | 04:21 AM

టీజీఎప్‌సెట్ పరీక్షలకు సర్వర్‌ సమస్యలు ఎదురవుతున్నాయి. హైదరాబాద్‌లోని పలు పరీక్ష కేంద్రాల్లో సర్వర్లు మొరాయించడంతో అభ్యర్థులు ఇబ్బందిపడ్డారు.

Server Issues: ఎప్‌సెట్‌ అభ్యర్థులకు ‘సర్వర్‌’ కష్టాలు!

  • పరీక్ష కేంద్రాల్లో మొరాయిస్తున్న సర్వర్లు

  • సమయాన్ని సర్దుబాటు చేశామన్న అధికారులు

  • రెండో రోజు 93.83 శాతం హాజరు

హైదరాబాద్‌ సిటీ, మే 3 (ఆంధ్రజ్యోతి): టీజీఎప్‌సెట్ పరీక్షలకు సర్వర్‌ సమస్యలు ఎదురవుతున్నాయి. హైదరాబాద్‌లోని పలు పరీక్ష కేంద్రాల్లో సర్వర్లు మొరాయించడంతో అభ్యర్థులు ఇబ్బందిపడ్డారు. దీంతో పరీక్ష కేంద్రాల్లోకి వెళ్లిన విద్యార్థులు షెడ్యూల్‌ సమయంకన్నా 45నిమిషాల నుంచి గంటవరకు ఆలస్యంగా బయటకు వస్తున్నారు. శనివారం ఇంజనీరింగ్‌ పరీక్షకు బాచుపల్లిలోని బీవీఆర్‌ఐటీ ఇంజనీరింగ్‌ కాలేజీలో సర్వర్‌ సమస్యలు తలెత్తాయి. రెండో సెషన్‌లో పరీక్ష రాసిన విద్యార్థులు సాయంత్రం 6గంటలకు బయటకురావాల్సి ఉండగా.. 6.45వరకు రాకపోవడంతో తల్లిదండ్రులు కాస్త ఆందోళనకు గురయ్యారు. కొన్ని కళాశాలల్లో పాత కంప్యూటర్లనే వినియోగిస్తుండటం సమస్యలు తలెత్తిఉండవచ్చని ఐటీ నిపుణులు చెబుతున్నారు.


మరోవైపు మెయిన్‌ సర్వర్‌కు కనెక్టయ్యే కళాశాలల్లోని లోకల్‌ సర్వర్లను సిబ్బంది మెయింటెనెన్స్‌ చేయకపోవడమూ కారణం కావచ్చంటున్నారు. ఈ విషయమై ఎప్‌సెట్‌ అధికారులు స్పందిస్తూ.. సర్వర్‌ సమస్య తలెత్తితే కంప్యూటర్లను రీబూట్‌ చేయడానికి 20-45 నిమిషాలు పడుతుందని, అప్పుడు అభ్యర్థులు నష్టపోయిన సమయాన్ని సర్దుబాటు చేసినట్టు చెప్పారు. ఇక శనివారం (రెండోరోజు) జరిగిన ఎప్‌సెట్‌ ఇంజనీరింగ్‌ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 73,777 మంది రిజిస్ట్రేషన్‌ చేసుకోగా 69,227 మంది (93.83శాతం)అభ్యర్థులు హాజరయ్యారు. రెండోరోజు లెక్కల ప్రశ్నలు కఠినంగా, సుదీర్ఘంగా ఉండటంతో ఎక్కువగా ఆన్సర్‌ చేయలేకపోయినట్టు అభ్యర్థులు తెలిపారు. ఫిజిక్స్‌ ప్రశ్నలు మోస్తరు కఠినంగా, కెమిస్ట్రీ ప్రశ్నలు సులువుగా ఉన్నట్లు పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి..

ఈ తప్పులు చేయకుంటే హైదరాబాద్ జట్టు గెలిచేది..కానీ చివరకు

ట్రాన్స్‌జెండర్లకు చోటు లేదు

హైదరాబాద్ ఓటమి, గుజరాత్ ఘన విజయం

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 04 , 2025 | 04:22 AM