Seethakka: ఆదివాసీల మీద కేంద్రం దాడి: మంత్రి సీతక్క
ABN , Publish Date - Aug 09 , 2025 | 04:03 AM
ఆదివాసీ, గిరిజనుల మీద కేంద్ర ప్రభుత్వం రకరకాల రూపాల్లో దాడులు చేస్తోందని మంత్రి సీతక్క విమర్శించారు. కార్పొరేట్ శక్తుల ప్రయోజనాల కోసం అడవి బిడ్డల హక్కులు కాలరాస్తున్నారని ధ్వజమెత్తారు.
హైదరాబాద్ సిటీ, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): ఆదివాసీ, గిరిజనుల మీద కేంద్ర ప్రభుత్వం రకరకాల రూపాల్లో దాడులు చేస్తోందని మంత్రి సీతక్క విమర్శించారు. కార్పొరేట్ శక్తుల ప్రయోజనాల కోసం అడవి బిడ్డల హక్కులు కాలరాస్తున్నారని ధ్వజమెత్తారు. నాంపల్లితెలుగు విశ్వవిద్యాలయంలో ఆద్యకళ మ్యూజియం వారి ఆధ్వర్యంలో ‘ఆదివాసీ ఉరుములు - మెరుపులు’ పేరుతో నిర్వహించిన మూలవాసీల కాంతి దీపాల ప్రదర్శనను సీతక్క ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఆదివాసీ, గిరిజన, బహుజన శ్రామికుల కళా సంపదను భవిష్యత్తు తరాలకు అందించేందుకు కార్యక్రమ నిర్వాహకుడు ప్రొ. జయధీర్ తిరుమల రావు చేస్తున్న కృషి అసాధారణమైనదంటూ కొనియాడారు.
ప్రస్తుతం ఉస్మానియా విశ్వవిద్యాలయ ఆవరణలో ఆద్యకళ ప్రదర్శన ఏర్పాటుకు తామంతా అండగా నిలుస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి, ప్రజా గాయని విమలక్క, జయరాజ్, సామాజిక కార్యకర్తలు పృఽథ్వీరాజ్, అపర్ణ తోట, కేంద్ర సాహిత్య అకాడమీ యువపురస్కార గ్రహీత పసునూరి రవీందర్‌తో పాటు వివిధ కళా రూపాలకు చెందిన సుమారు 80 మంది కళాకారులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అవి చూసి షాక్ అయ్యా: బండి సంజయ్
‘బీజేపీలోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు’
For More AndhraPradesh News And Telugu News