Share News

Mulugu: స్టెప్పులేసిన మంత్రి సీతక్క

ABN , Publish Date - Jan 26 , 2025 | 03:51 AM

మంత్రి ధనసరి అనసూయ సీతక్క డీజే టిల్లు సినిమా పాటలు, తీన్‌మార్‌ మ్యూజిక్‌కు స్టెప్పులేశారు. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా శనివారం ములుగు జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో త్రీకే రన్‌ జరిగింది.

Mulugu: స్టెప్పులేసిన మంత్రి సీతక్క

  • ములుగులో జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలు

ములుగు, జనవరి 25 (ఆంధ్య్రజ్యోతి): మంత్రి ధనసరి అనసూయ సీతక్క డీజే టిల్లు సినిమా పాటలు, తీన్‌మార్‌ మ్యూజిక్‌కు స్టెప్పులేశారు. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా శనివారం ములుగు జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో త్రీకే రన్‌ జరిగింది. కార్యక్రమాన్ని మహబూబాబాద్‌ ఎంపీ పోరిక బలరాంనాయక్‌తో కలిసి జెండా ఊపి ప్రారంభించిన సీతక్క.. యువతీ యువకులతో కలిసి పరుగు పందెంలో పాల్గొన్నారు.


అనంతరం కలెక్టర్‌ టీఎ్‌స.దివాకర, ఎస్పీ శబరీశ్‌, పోలీసు సిబ్బందితో కలిసి సీతక్క డ్యాన్స్‌ అలరించారు. పౌష్టికాహారం తీసుకుంటూ నిత్యం వ్యాయామం చేయడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఆమె సూచించారు.

Updated Date - Jan 26 , 2025 | 03:51 AM