Share News

Seethakka: ఐటీడీఏ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల బాధ్యతలు పీవోలకే ఇవ్వాలి: మంత్రి సీతక్క

ABN , Publish Date - May 09 , 2025 | 04:01 AM

ఇందిరమ్మ ఇళ్ల పథకం బాధ్యతలను జిల్లాల వారీగా కలెక్టర్లు పర్యవేక్షిస్తుండగా.. ఐటీడీఏల పరిధిలో మాత్రం ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్ల (పీవో)కు అప్పగించాలని మంత్రి సీతక్క పేర్కొన్నారు.

Seethakka: ఐటీడీఏ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల బాధ్యతలు పీవోలకే ఇవ్వాలి: మంత్రి సీతక్క

హైదరాబాద్‌, మే 8 (ఆంధ్రజ్యోతి): ఇందిరమ్మ ఇళ్ల పథకం బాధ్యతలను జిల్లాల వారీగా కలెక్టర్లు పర్యవేక్షిస్తుండగా.. ఐటీడీఏల పరిధిలో మాత్రం ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్ల (పీవో)కు అప్పగించాలని మంత్రి సీతక్క పేర్కొన్నారు. గురువారం సచివాలయంలో గృహ నిర్మాణ శాఖ అధికారులు జ్యోతిబుద్ధ ప్రకాశ్‌, వీపీ గౌతమ్‌లతో సమావేశమైన సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఐటీడీఏ పరిధిలో ఇళ్ల కోసం వచ్చిన దరఖాస్తులను ఐటీడీఏ పీవోలకు పంపి అర్హులను గుర్తించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఐటీడీఏల పరిధిలో చాలా మంది పాకల్లోనే ఉంటున్నారని, వారికి మొదటి ప్రాధాన్యత కింద ఇళ్లను మంజూరు చేయించాలని సూచించినట్టు మంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.


ఈ వార్తలు కూడా చదవండి..

నూతన మేయర్‌గా కోవెలమూడి రవీంద్ర ఎన్నిక

హరి‌రామ్‌ బ్యాంక్ లాకర్లను ఓపెన్ చేయనున్న ఏసీబీ అధికారులు...

విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలి

For More AP News and Telugu News

Updated Date - May 09 , 2025 | 04:01 AM