Share News

Mid Day Meal Workers: ‘మధ్యాహ్న భోజనం’ కార్మికుల ఆందోళన

ABN , Publish Date - Aug 07 , 2025 | 05:15 AM

బకాయిలో ఉన్న అయిదు నెలల వేతనాలను, 9 నెలల కోడి గుడ్ల బిల్లులను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని కోరుతూ ప్రభుత్వ పాఠశాలల్లోని మధ్యాహ్న భోజన పథకం కార్మికులు డిమాండ్‌ చేశారు.

Mid Day Meal Workers: ‘మధ్యాహ్న భోజనం’ కార్మికుల ఆందోళన

  • బకాయి వేతనాలను చెల్లించాలని డిమాండ్‌

ఖైరతాబాద్‌, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): బకాయిలో ఉన్న అయిదు నెలల వేతనాలను, 9 నెలల కోడి గుడ్ల బిల్లులను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని కోరుతూ ప్రభుత్వ పాఠశాలల్లోని మధ్యాహ్న భోజన పథకం కార్మికులు డిమాండ్‌ చేశారు. వివిధ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో వచ్చిన మహిళా కార్మికులు సీఐటీయూ ఆధ్వర్యంలో బుధవారం పాఠశాల విద్యాశాఖ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. ఘర్షణ వాతావరణం ఏర్పడడంతో పోలీసులు కొంతమంది కార్మికులను అరెస్టు చేశారు. పాత మెనూ ప్రకారమే ప్రభుత్వం తమకు 5 నెలలుగా బిల్లులు ఇవ్వట్లేదని, కొత్త మెనూ ప్రకారం విద్యార్థులకు ఏ విధంగా భోజనం పెట్టాలని సంఘం నాయకులు ప్రశ్నించారు. పెండింగ్‌ వేతనాల కోసం తమ చుట్టూ చెప్పులరిగేలా తిరగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కట్టెల పొయ్యి బదులు గ్యాస్‌స్టవ్‌ వాడాలని చెబుతున్న ప్రభుత్వం తమకు నేటికీ గ్యాస్‌ సిలిండర్లు మంజూరు చేయడం లేదని వాపోయారు. అనంతరం బకాయిలతో పాటు కొత్త మెనూ ప్రకారం బిల్లులను సకాలంలో చెల్లించాలని కోరుతూ పాఠశాల విద్యాశాఖ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు.


విష జ్వరంతో ఒకరి మృతి

వాజేడు, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): విష జ్వరంతో ములుగు జిల్లా వాజేడు మండలానికి చెందిన కొండగొర్ల నర్సింహరావు(56) అనే వ్యక్తి మృతి చెందాడు. మండలంలోని ముత్తారం కాలనీకి చెందిన నర్సింహరావు వారం క్రితం జ్వరం బారిన పడి స్థానికంగా ఓ ఆస్పత్రిలో చికిత్స పొందాడు. అయినా తగ్గకపోవడంతో మొదట ఏటూరునాగారంలోని ఓ ప్రైవేట్‌ వైద్యశాలలో తర్వాత వరంగల్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేరాడు. బుధవారం ఉదయం పరిస్థితి విషమించి మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఏపీ కేబినెట్ భేటీ.. పలు కీలక నిర్ణయాలు

ఈడీ విచారణ అనంతరం విజయ్ దేవరకొండ కీలక వ్యాఖ్యలు

Updated Date - Aug 07 , 2025 | 05:15 AM