Share News

SC Gurukulas: ఎస్సీ విద్యార్థులు, నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణ

ABN , Publish Date - May 26 , 2025 | 05:17 AM

ఎస్సీ గురుకులాల్లో పదో తరగతి, ఐటీఐ, పాలిటెక్నిక్‌, డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న, పూర్తిచేసిన విద్యార్థులు, నిరుద్యోగులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.

SC Gurukulas: ఎస్సీ విద్యార్థులు, నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణ

  • ఉన్నతి ఫౌండేషన్‌తో ఎంవోయూ

హైదరాబాద్‌, మే 25 (ఆంధ్రజ్యోతి): ఎస్సీ గురుకులాల్లో పదో తరగతి, ఐటీఐ, పాలిటెక్నిక్‌, డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న, పూర్తిచేసిన విద్యార్థులు, నిరుద్యోగులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే ఎస్‌జీబీఎస్‌ ఉన్నతి ఫౌండేషన్‌తో ఎస్సీ గురుకుల విద్యాలయాల సంస్థ ఎంవోయూ చేసుకుంది.


ఎంపికైన వారికి స్పోకెన్‌ ఇంగ్లీష్‌, లైఫ్‌ స్కిల్స్‌, విలువ ఆధారిత జీవన నైపుణ్యాలు, హెచ్‌ఆర్‌ సంబంధిత స్కిల్స్‌ వంటి అంశాల్లో శిక్షణ ఇవ్వనున్నారు. ఈ శిక్షణ జూన్‌ మూడో వారం నుంచి ప్రారంభమవుతుంది. 238 గురుకుల కేంద్రాల్లో ఒక్కో బ్యాచ్‌లో 40మంది చొప్పున 45రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నట్లు ఎస్సీ గురుకులాల సంస్థ కార్యదర్శి అలుగు వర్షిణి తెలిపారు.


ఇవి కూడా చదవండి

Shashi Tharoor: పార్టీ కోసమే పని చేస్తున్నా.. క్లారిటీ ఇచ్చిన శశిథరూర్

ponnam prabhakar: తల్లిదండ్రులు వారి పిల్లలను శక్తి మేర చదివించాలి: పొన్నం

Updated Date - May 26 , 2025 | 05:17 AM