Share News

Medaram Jatara: ములుగు మన్నెంలో జాతరల సందడి మేడారంలో నేటి నుంచి చిన్న జాతర

ABN , Publish Date - Feb 12 , 2025 | 05:58 AM

తాడ్వాయి మండలం మేడారంలో సమ్మ క్క, సారలమ్మ చిన్నజాతర బుధవారం ప్రారంభం కానుంది. ఈ నెల 15 వరకు నాలుగు రోజులపాటు ఈ వేడుకలు కొనసాగనున్నాయి.

Medaram Jatara: ములుగు మన్నెంలో జాతరల సందడి మేడారంలో నేటి నుంచి చిన్న జాతర

ఏటూరు నాగారం, కన్నాయిగూడెం, మంగపేటలో వేడుకలు

రూ.4 కోట్లతో ప్రభుత్వం ఏర్పాట్లు

ములుగు, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి): ములు గు ఏజెన్సీలో జాతరల సందడి నెలకొంది. ఆదివాసీలు తమ ఇలవేల్పులను కొలుచుకొనే వేడుకలతో గూడేలు పండగ వాతావరణం సంతరించుకున్నాయి. తాడ్వాయి మండలం మేడారంలో సమ్మ క్క, సారలమ్మ చిన్నజాతర బుధవారం ప్రారంభం కానుంది. ఈ నెల 15 వరకు నాలుగు రోజులపాటు ఈ వేడుకలు కొనసాగనున్నాయి. తొలిరోజు సమ్మక్క కొలువైన మేడారంతోపాటు సారలమ్మ కొలువుదీరిన కన్నెపల్లిలోని పూజా మందిరాలను శుద్ధిచేసి అలుకుపూతలు చేస్తారు. గ్రామాలకు ద్వారబంధనం విధించి పొలిమేర దేవతలకు పూజ లు నిర్వహిస్తారు. రాత్రివేళ వనదేవతల గద్దెల వద్ద పూజారులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి జాగరణ చేస్తారు. వనదేవతలుగా కీర్తించబడుతున్న సమ్మక్క, సారలమ్మ, గోవిందరాజులు, నాగులమ్మ నడయాడిన అడవి పల్లెల్లో అక్కడి గిరిజనులు అనుబంధ జాతరలను జరుపుతున్నారు. సమ్మక్కకు పుట్టినిల్లయిన తాడ్వాయి మండలం బయ్యక్కపేటలో కూడా బుధవారం నుంచే జాతర జరగనుంది.


తమ ఆడబిడ్డగా కొలుచుకునే చందా వంశీయులు సమీపంలోని గుట్ట నుంచి సమ్మక్కను గద్దెపైకి చేర్చి భక్తులకు దర్శనభాగ్యం కల్పిస్తారు. ఏటూరునాగారం మండలం కొండాయిలో గోవిందరాజులు, నాగులమ్మ, దొడ్లలో సారలమ్మ, కన్నాయిగూడెం మండలం ఐలాపూర్‌లో సమ్మక్క, సారలమ్మ, మంగపేట మండలం జబ్బోనిగూడెం నెమళ్లగుట్టపై సమ్మక్క జాతర బుధవారం నుంచి మొదలై నాలుగు రోజులు జరగనుంది. మేడారంలో జరిగే చిన్నజాతర కోసం రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన రూ.4కోట్లతో ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆర్టీసీ హనుమకొండ బస్టాండు నుంచి వారంపాటు వంద ప్రత్యేక బస్సులను నడిపిస్తోంది. ములుగు జిల్లా ఎస్పీ శబరీశ్‌ నేతృత్వం లో ఇద్దరు అదనపు ఎస్పీలు, డీఎస్పీ, 12 మంది సీఐలు, 30 మంది ఎస్సైలతోపాటు 600 మంది సిబ్బందితో బందోబస్తు నిర్వహించనున్నారు.

జాతరపై బర్డ్‌ఫ్లూ ఎఫెక్ట్‌..!

మేడారం జాతరలో కోడిని గద్దెల వైపు ఎగురవేసి ఎదురుకోళ్ల మొక్కు సమర్పిస్తారు. అక్కడే విడిది చేసి వండుకొని బంధుమిత్రులతో విందు చేసుకుంటారు. అయితే.. పలు జిల్లాల్లో బ్రాయిలర్‌ కోళ్లకు బర్డ్‌ఫ్లూ సోకుతుండటం, ప్రభుత్వం అప్రమత్తమై కొద్దిరోజులు చికెన్‌ తినొద్దని సూచిస్తున్న నేపథ్యంలో చిన్న జాతరపై ప్రభావం పడనుంది.


మరిన్ని తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: ప్రభుత్వానికి రుణ మంజూరు పత్రాలు అందజేసిన హడ్కో ప్రతినిధులు

Also Read: కేటీఆర్‌తోపాటు ఆయన ఫ్యామిలీ దరఖాస్తు చేసుకుంటే..

Also Read: సీఐడీ మాజీ డీజీ పీవీ సునీల్ కుమార్‌పై విచారణలో కీలక పరిణామం

Also Read: ఇన్ని సవాళ్లు ఎదుర్కోవడం ఇదే తొలిసారి

Also Read : అరచేతిలో స్వర్గం చూపించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్

Also Read : పీజీ మెడికల్ సీట్లలో స్థానికత కోటా విచారణకు అనుమతించిన సుప్రీంకోర్టు

Also Read: వీఐపీల భద్రత కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం

Also Read: బెల్ట్ షాపులు నిర్వహిస్తే.. కేసు నమోదు

For National News And Telugu News

Updated Date - Feb 12 , 2025 | 05:58 AM