High Court: న్యాయవాదుల రక్షణకు చట్టం చేయండి
ABN , Publish Date - Jun 30 , 2025 | 05:34 AM
కక్షిదారులకు న్యాయం చేయడం కోసం పోరాడుతున్న న్యాయవాదులపై ఇటీవల దాడులు పెరిగిపోతున్న నేపథ్యంలో అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్టును తీసుకురావాలని హైకోర్టు అడ్వకేట్ అసోసియేషన్ ప్రభుత్వానికి విజ్ఙప్తి చేసింది......
సీఎంకు హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ వినతి
హైదరాబాద్, జూన్ 29 (ఆంధ్రజ్యోతి): కక్షిదారులకు న్యాయం చేయడం కోసం పోరాడుతున్న న్యాయవాదులపై ఇటీవల దాడులు పెరిగిపోతున్న నేపథ్యంలో అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్టును తీసుకురావాలని హైకోర్టు అడ్వకేట్ అసోసియేషన్ ప్రభుత్వానికి విజ్ఙప్తి చేసింది. ఆ సంఘం అధ్యక్షుడు ఏ జగన్ ఆధ్వర్యంలో కార్యవర్గ సభ్యులు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. అడ్వకేట్స్ హౌసింగ్ కోఆపరేటివ్ సొసైటీకి 50 ఎకరాల స్థలం కేటాయించాలని, హైకోర్టు అడ్వకేట్ అసోసియేషన్‌కు ఏటా రూ.5 కోట్లు ఇవ్వాలని కోరారు.
జూనియర్ న్యాయవాదులకు స్టైఫండ్ ఇవ్వాలని, కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన మేరకు న్యాయవాదుల సంక్షేమానికి రూ.100 కోట్లు కేటాయించాలని కోరారు. 2019 తర్వాత నమోదు అయిన న్యాయవాదులకు హెల్త్ కార్డ్స్ అందజేయాలని కోరారు. సీఎంను కలిసిన వారిలో హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ కార్యదర్శి కాజా విజారత్ అలీ తదితరులు ఉన్నారు.