Koduri Srirama murthy: ప్రముఖ కథా రచయిత కోడూరి శ్రీరామమూర్తి కన్నుమూత
ABN , Publish Date - Aug 06 , 2025 | 04:06 AM
ప్రముఖ కథా రచయిత, సాహిత్య విమర్శకుడు కోడూరి శ్రీరామమూర్తి మంగళవారం రాత్రి తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని ఆయన స్వగృహంలో కన్నుమూశారు.
రాజమహేంద్రవరం కల్చరల్, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ కథా రచయిత, సాహిత్య విమర్శకుడు కోడూరి శ్రీరామమూర్తి మంగళవారం రాత్రి తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని ఆయన స్వగృహంలో కన్నుమూశారు. శ్రీరామమూర్తి లిటరరీ కాలమిస్టుగా, సమకాలీన ఆర్థిక, సామాజిక, రాజకీయ, సాంస్కృతిక అంశాలను విశ్లేషిస్తూ దినపత్రికల్లో వ్యాసాలు రాసే ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా, సాహితీ విమర్శకుడిగా పలువురి మన్ననలను పొందారు. తెలుగు నవలా సాహిత్యంలో మనో విశ్లేషణ పుస్తకం 1978లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ నుంచి ఉత్తమ సాహిత్య విమర్శ గ్రంథంగా పురస్కారం పొందింది. తెలుగు కథ... నాడు-నేడు పుస్తకం 2007లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి ఉత్తమ సాహిత్య విమర్శనా గ్రంథంగా పురస్కారం పొందింది.
విమాన ఇంధనం దొంగిలించిన ముఠా అరెస్టు
న్యూఢిల్లీ, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): విమాన ఇంధనాన్ని (ఏటీఎఫ్) దొంగిలించి, బహిరంగ మార్కెట్‌లో విక్రయిస్తున్న ముఠాను ఢిల్లీ పోలీసులు పట్టుకున్నారు. ఈ ముఠా రోజుకు 5వేల లీటర్ల మేర ఏటీఎఫ్‌ను దొంగిలించి, నెలవారీగా రూ.1.62 కోట్ల నష్టం కలిగించినట్లు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి ఢిల్లీ పోలీసులు (క్రైమ్ బ్రాంచ్) 10 మందిని అరెస్టు చేసి, గత జూన్ 26న ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. దీనిపై మరింత దర్యాప్తు జరుగుతోంది. ఈ విషయాలను పార్లమెంటులో ఓ ఎంపీ అడిగిన ప్రశ్నకు సమాధానంగా హోం శాఖ వెల్లడించింది.
ఈ వార్తలు కూడా చదవండి
పార్లమెంట్ ఆవరణలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల ఆందోళన
కేసీఆర్ ఇచ్చిన టాస్క్‌ను పూర్తి చేశా.. గువ్వాల బాలరాజు షాకింగ్ కామెంట్స్
Read latest Telangana News And Telugu News