Share News

Agricultural Growth: వహ్వా యాసంగి!

ABN , Publish Date - May 09 , 2025 | 03:14 AM

ఈ యాసంగిలో విస్తీర్ణం పరంగా వివిధ పంటల సాగు రికార్డు స్థాయిలో నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా 79,96,302 ఎకరాల్లో వివిధ పంటలు సాగయ్యాయి.

Agricultural Growth: వహ్వా యాసంగి!

  • రికార్డు స్థాయిలో 80 లక్షల ఎకరాల్లో పంటల సాగు

  • ప్రభుత్వానికి రాష్ట్ర వ్యవసాయశాఖ తుది నివేదిక

హైదరాబాద్‌, మే 8 (ఆంధ్రజ్యోతి): ఈ యాసంగిలో విస్తీర్ణం పరంగా వివిధ పంటల సాగు రికార్డు స్థాయిలో నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా 79,96,302 ఎకరాల్లో వివిధ పంటలు సాగయ్యాయి. నిరుడు యాసంగిలో సాగైన విస్తీర్ణంతో పోలిస్తే ఇది 12.25 లక్షల ఎకరాల మేర ఎక్కువ కావడం విశేషం. ఈ మేరకు రాష్ట్ర వ్యవసాయశాఖ తుది నివేదికను రూపొందించి ప్రభుత్వానికి సమర్పించింది. నిరుడు (2023-24) యాసంగిలో 67,70,396 ఎకరాల్లో పంటలు సాగవ్వగా, ఈసారి సుమారు 80 లక్షల ఎకరాల్లో రైతులు పంటలు సాగుచేయటం గమనార్హం. రాష్ట్రంలో యాసంగి సాధారణ సాగు విస్తీర్ణం 63,54,286 ఎకరాలు.


దీంతో పోలిస్తే... ఈ ఏడాది 26ు మేర ఎక్కువ విస్తీర్ణంలో పంటలు సాగుచేసినట్లు నివేదికలో వ్యవసాయ శాఖ పేర్కొంది. యాసంగిలో వరి సాధారణ విస్తీర్ణం 47.27 లక్షల ఎకరాలు కాగా ఈసారి 59.84 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. ఈ సీజన్‌లో 3.67 లక్షల ఎకరాల్లో జొన్న, 9.13 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న, 2.23 లక్షల ఎకరాల్లో శనగ, 56 వేల ఎకరాల్లో మినుము, 2.51 లక్షల ఎకరాల్లో వేరుశనగ, 32 వేల ఎకరాల్లో నువ్వులు, 21 వేల ఎకరాల్లో పొద్దుతిరుగుడు పంటలు సాగైనట్లు వ్యవసాయ శాఖ పేర్కొంది. 2024-25లో 30 శాతం అధిక వర్షపాతం నమోదైనట్లు తెలిపింది.


ఈ వార్తలు కూడా చదవండి..

నూతన మేయర్‌గా కోవెలమూడి రవీంద్ర ఎన్నిక

హరి‌రామ్‌ బ్యాంక్ లాకర్లను ఓపెన్ చేయనున్న ఏసీబీ అధికారులు...

విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలి

For More AP News and Telugu News

Updated Date - May 09 , 2025 | 03:15 AM