Share News

Hyderabad: ఐపీఎల్‌లో ఆర్‌సీబీ విజయంతో గ్రేటర్‌ రోడ్లపై అభిమానుల హల్‌చల్‌

ABN , Publish Date - Jun 05 , 2025 | 03:39 AM

ఐపీఎల్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్టు విజయం సాధించడంతో.. హైదరాబాద్‌లో అభిమానులు మంగళవారం రాత్రి హల్‌చల్‌ చేశారు.

Hyderabad: ఐపీఎల్‌లో ఆర్‌సీబీ విజయంతో గ్రేటర్‌ రోడ్లపై అభిమానుల హల్‌చల్‌

  • పలుచోట్ల ట్రాఫిక్‌కు ఇబ్బందులు.. లాఠీచార్జి చేసిన పోలీసులు

హైదరాబాద్‌ సిటీ/ కేపీహెచ్‌బీకాలనీ, జూన్‌ 4 (ఆంధ్రజ్యోతి): ఐపీఎల్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్టు విజయం సాధించడంతో.. హైదరాబాద్‌లో అభిమానులు మంగళవారం రాత్రి హల్‌చల్‌ చేశారు. విరాట్‌ కోహ్లీ ప్లకార్డులు పట్టుకుని, విజయం సాధించారంటూ నినాదాలు చేశారు. సచివాలయం ఎదురుగా ఉన్న ప్రాంతానికి వేలమంది క్రికెట్‌ అభిమానులు చేరుకొన్నారు.


స్టీల్‌ పళ్లాలను మోగిస్తూ, బాణసంచా పేల్చుతూ సంబురాలు చేసుకున్నారు. మాదాపూర్‌, కేపీహెచ్‌బీ కాలనీ కమాన్‌ ప్రాంతాల్లోనూ అభిమానులు రోడ్లపైకి వచ్చి బాణసంచా కాల్చారు. దీంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. పలుచోట్ల పోలీసులు లాఠీచార్జి చేసి చెదరగొట్టారు.


ఇవీ చదవండి:

రైల్వే టిక్కెట్ల వెనుక బిగ్ స్కాం.. మోసపోయిన లక్షల మంది..

జూన్ నెలలో 12 రోజులు బ్యాంకులు బంద్..

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 05 , 2025 | 03:39 AM