Rahul Gandhi: సీఎం రేవంత్‌కు రాహుల్ ఫోన్
ABN , Publish Date - Feb 24 , 2025 | 03:41 AM
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ.. సీఎం రేవంత్‌రెడ్డికి ఫోన్ చేశారు. ఎస్‌ఎల్‌బీసీ ప్రమాద ఘటనపై ఆరా తీసిన ఆయన.. సొరంగంలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు.

కార్మికులను రక్షించేందుకు ఉన్న ఏ అవకాశాన్నీ వదులుకోవద్దని సూచన
ఎస్‌ఎల్‌బీసీ ప్రమాద ఘటనపై ఆరా
హైదరాబాద్, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ.. సీఎం రేవంత్‌రెడ్డికి ఫోన్ చేశారు. ఎస్‌ఎల్‌బీసీ ప్రమాద ఘటనపై ఆరా తీసిన ఆయన.. సొరంగంలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రమాద ఘటన తెలిసిన వెంటనే సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డిని ఘటనా స్థలానికి పంపానని.. సహాయక చర్యలు చేపట్టేందుకు ఎన్‌ఆర్‌డీఎ్‌ఫ, ఎస్డీఆర్‌ఎఫ్ రెస్క్యూ స్క్వాడ్‌నూ పంపామని సీఎం చెప్పారు.
గాయపడిన వారికి వైద్య సహాయం అందించడం, సొరంగంలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టామని వివరించారు. ప్రభుత్వం స్పందించిన తీరు, తీసుకుంటున్న చర్యలను రాహుల్ ప్రశంసించారు. సొరంగంలో చిక్కుకున్న కార్మికులను రక్షించేందుకు ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోవద్దని సూచించారు.