Share News

Jagga Reddy: కులగణన రాహుల్‌ ఆదేశం

ABN , Publish Date - Jul 31 , 2025 | 05:39 AM

బీసీ కులగణన రాహుల్‌గాంధీ నినాదమని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి అన్నారు.

Jagga Reddy: కులగణన రాహుల్‌ ఆదేశం

  • రేవంత్‌, మహే్‌షగౌడ్‌ అమలు చేశారు

  • కేసీఆర్‌, కేటీఆర్‌ కవితను వెళ్లగొట్టారు

  • ఉనికి కోసమే ఆమె డ్రామాలు ఆడుతోంది

  • నాడు కవితకు బీసీలు గుర్తుకు రాలేదా?

  • బీజేపీ తెలంగాణ ఎంపీలు.. మోదీకి చెప్పి బీసీలకు 42% రిజర్వేషన్‌ అమలు చేయించండి

  • టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తూర్పు జగ్గారెడ్డి

హైదరాబాద్‌, జూలై 30 (ఆంధ్రజ్యోతి): బీసీ కులగణన రాహుల్‌గాంధీ నినాదమని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి అన్నారు. ఆయన ఆదేశం మేరకు రాష్ట్రంలో కులగణనను సీఎం రేవంత్‌రెడ్డి, టీపీసీసీ చీఫ్‌ మహే్‌షగౌడ్‌లు అమలు చేశారని కితాబునిచ్చారు. రాహుల్‌ ఆలోచన మేరకే విద్య, ఉద్యోగాలు, స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్‌ కోసం వారు కృషి చేస్తున్నారన్నారు. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి బీజేపీ తెలంగాణ ఎంపీలు ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. ప్రధాని మోదీకి చెప్పి.. కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న రెండు బీసీ బిల్లులను ఆమోదింప చేయాలని, తెలంగాణలో బీసీలకు 425 రిజర్వేషన్‌ అమలు చేయించాలని సూచించారు. ఓల్డ్‌ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షీ నటరాజన్‌, టీపీసీసీ చీఫ్‌ మహే్‌షకుమార్‌గౌడ్‌లతో మంగళవారం భేటీ అయిన జగ్గారెడ్డి.. అనంతరం మీడియాతో మాట్లాడారు. కేసీఆర్‌, కేటీఆర్‌లు కవితను ఇంట్లోంచి వెళ్లగొట్టారని, దీంతో బీసీ రిజర్వేషన్ల పేరుతో ఉనికి కోసం ఆమె డ్రామాలు ఆడుతోందన్నారు. ‘‘కవిత కూడా ఒక లీడరా? ఆమె కెపాసిటీ ఎంత? కేసీఆర్‌ అధికారంలో ఉన్నప్పుడు ఆమెకు బీసీలు ఎందుకు గుర్తుకు రాలేదు? ఇంట్లోంచి వెళ్లగొట్టాక బీసీ రిజర్వేషన్లు గుర్తుకొచ్చాయా?’’ అంటూ నిలదీశారు. కన్న తండ్రి, సొంత అన్నే ఇంట్లోంచి వెళ్లగొట్టాక.. ఇంక కవిత గురించి మాట్లాడటం అనవసరమన్నారు. బీసీ రిజర్వేషన్ల గురించి ఇప్పుడు మాట్లాడుతున్న బీఆర్‌ఎస్‌ నేతలు.. అధికారంలో ఉన్న పదేళ్లు ఏం చేశారని ప్రశ్నించారు. కాగా.. కాంగ్రెస్‌ బలోపేతం, పార్టీ జిల్లా కమిటీల కూర్పు తదితర అంశాలపైన పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌ సమీక్ష చేశారని చెప్పారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్‌ నేతలకు ప్రభుత్వ, పార్టీ పోస్ట్‌లలో ప్రాధాన్యత ఇవ్వాలని తాను సూచించానని జగ్గారెడ్డి చెప్పారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తప్పు చేస్తే జగన్ అరెస్ట్ కావడం ఖాయం: ఏపీ బీజేపీ చీఫ్

ఈ ఆకును నాన్ వేజ్‌తో కలిపి వండుకుని తింటే ..

For More International News And Telugu News

Updated Date - Jul 31 , 2025 | 05:39 AM