Bhatti Vikramarka: విద్యాభివృద్ధికి ప్రైవేటు సంస్థలు కలిసి రావాలి
ABN , Publish Date - Aug 26 , 2025 | 03:44 AM
విద్యా రంగ అభివృద్ధికి ప్రైవేటు సంస్థలు ప్రభుత్వంతో కలిసి రావాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు.....
విద్యా రంగ అభివృద్ధికి ప్రైవేటు సంస్థలు ప్రభుత్వంతో కలిసి రావాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. ప్రైవేటు విద్యా సంస్థల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. సోమవారం జూబ్లీహిల్స్‌లోని ఓ ప్రైవేట్ సంస్థ విద్యా రంగంపై రూపొందించిన కాఫీ టేబుల్ పుస్తకావిష్కరణ అనంతరం ఆయన మాట్లాడారు. మారుతున్న సామాజిక అవసరాలకు అనుగుణంగా సిలబస్ మారితేనే ప్రయోజనం ఉంటుందన్నారు. రాబోయే 50, 100 సంవత్సరాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని తమ ప్రజా ప్రభుత్వం విద్యా రంగాన్ని అభివృద్ధి చేస్తోందని తెలిపారు. యవత కోసం ఏర్పాటు చేసిన స్కిల్ యూనివర్సిటీలో పరిశ్రమలకు పనికొచ్చేలా సిలబ్‌సను రూపొందించామని తెలిపారు.కోఠి ఉమెన్స్ కాలేజీకి చాకలి ఐలమ్మ పేరు పెట్టి రూ.500 కోట్లతో భవన నిర్మాణాలు చేపడుతున్నామని, ఉస్మానియా యూనివర్సిటీలో అవసరమైన అన్ని వసతులను ఏర్పాటు చేస్తున్నామని భట్టి వివరించారు.
ఇవి కూడా చదవండి..
ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనా రైతులకు హాని జరగనీయం.. అమెరికా టారిఫ్‌లపై మోదీ
ట్రంప్ టారిఫ్‌లపై పీఎంవో కీలక సమావేశం
For More National News