Share News

Private Bus Accident: పల్టీ కొట్టిన ప్రైవేట్ బస్సు.. ప్రయాణికులకు గాయాలు

ABN , Publish Date - Oct 13 , 2025 | 07:43 AM

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్ర శివారు ఖమ్మం - వరంగల్ ప్రధాన రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. 25 మంది ప్రయాణికులతో వెళ్తున్న ప్రైవేట్ బస్సు అదుపు తప్పి పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలు అయ్యాయి. దీంతో అక్కడనున్న స్థానికులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.

Private Bus Accident: పల్టీ కొట్టిన ప్రైవేట్ బస్సు.. ప్రయాణికులకు గాయాలు
Private Bus Accident

మహబూబాబాద్, అక్టోబర్ 13: మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్ర శివారు ఖమ్మం - వరంగల్ ప్రధాన రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. 25 మంది ప్రయాణికులతో వెళ్తున్న ప్రైవేట్ బస్సు అదుపు తప్పి పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలు అయ్యాయి. దీంతో అక్కడనున్న స్థానికులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదు. హైదరాబాద్ నుంచి కురవి వీరభద్ర స్వామి ఆలయానికి దర్శనం కోసం భక్తులు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఈ రోడ్డుప్రమాదంపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.


ఇవి కూడా చదవండి:

A three month old: పోలియో చుక్కలు వికటించి

Old Dispute: వివేక్‌ వర్సస్‌ అడ్లూరి

Updated Date - Oct 13 , 2025 | 07:43 AM