Telangana Government: మెట్రో రెండో దశ కోసం కేంద్రంపై ఒత్తిడి పెంచండి
ABN , Publish Date - Jul 20 , 2025 | 04:18 AM
హైదరాబాద్ మెట్రో రెండో దశ సాధన కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని పార్లమెంటు సభ్యులను తెలంగాణ..
ఎంపీలను కోరిన డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి కోమటి రెడ్డి
హైదరాబాద్, జూలై 19 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ మెట్రో రెండో దశ సాధన కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని పార్లమెంటు సభ్యులను తెలంగాణ ప్రభుత్వం కోరింది. శనివారం హైదరాబాద్‌లో ఎంపీలతో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సమావేశమయ్యారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ ఎంపీలు మల్లురవి, సురేశ్ షెట్కార్, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, రఘువీర్‌రెడ్డి, రఘురామిరెడ్డి, బలరాం నాయక్, అనిల్‌కుమార్ యాదవ్, బీజేపీ ఎంపీలు ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, రఘునందన్‌రావుతోపాటు మెట్రో రైలు ఎండీ ఎన్వీఎ్‌సరెడ్డి హాజరయ్యారు. ఐదు ట్రిలియన్ డాలర్ల ఎకానమీ నినాదంతో ముందుకు సాగుతున్న కేంద్ర ప్రభుత్వానికి హైదరాబాద్ వంటి మహా నగరాలు ఎంతో కీలకమని మల్లు భట్టి విక్రమార్క, కోమటి రెడ్డి చెప్పారు. పెట్టుబడులకు, పరిశ్రమలకు, ఉపాధికి స్వర్గధామం వంటి హైదరాబాద్‌కు మెట్రో రైలు రెండో దశ ప్రాజెక్టును మంజూరు చేయాలని కేంద్రాన్ని కోరారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తెలంగాణకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్
నేను ఎవరికీ భయపడేది లేదు... బండి సంజయ్‌కి స్ట్రాంగ్ కౌంటర్
Read Latest Telangana News and National News