Share News

Phone tapping: సిట్‌కు సహకరించని ప్రభాకర్‌రావు!

ABN , Publish Date - Jun 20 , 2025 | 04:05 AM

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు విచారణలో భాగంగా ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌రావు ఐదోసారి సిట్‌ ముందు హాజరయ్యారు. అధికారులు గురువారం ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 వరకు సుమారు 9గంటల పాటు ఆయనను ప్రశ్నించారు.

Phone tapping: సిట్‌కు సహకరించని ప్రభాకర్‌రావు!

  • ట్యాపింగ్‌ కేసులో 9 గంటల పాటు ప్రశ్నించినా సరైన జవాబులివ్వని ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌

  • సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లనున్న సిట్‌!

  • అరెస్టు వద్దంటూ ప్రభాకర్‌రావుకు ఇచ్చిన ఉపశమనాన్ని రద్దు చేయాలని కోరే అవకాశం

  • మళ్లీ నేడు విచారణకు రావాలని ఆదేశం

హైదరాబాద్‌/తాండూరు, జూన్‌ 19 (ఆంధ్రజ్యోతి): ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు విచారణలో భాగంగా ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌రావు ఐదోసారి సిట్‌ ముందు హాజరయ్యారు. అధికారులు గురువారం ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 వరకు సుమారు 9గంటల పాటు ఆయనను ప్రశ్నించారు. మళ్లీ శుక్రవారం విచారణకు రావాలని ఆదేశించినట్టు సమాచారం. సుదీర్ఘంగా విచారించినా ప్రభాకర్‌రావు దర్యాప్తు అధికారులకు పెద్దగా సహకరించలేదని తెలిసింది. దీనితో ప్రభాకర్‌రావు విచారణకు సంబంధించిన వివరాలు, ఆయన దర్యాప్తునకు సహకరించని తీరును సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లాలని సిట్‌ భావిస్తున్నట్టు సమాచారం. ఆగస్టు 5వ తేదీ వరకు ప్రభాకర్‌రావును అరెస్టు చేయవద్దంటూ ఇచ్చిన మధ్యంతర ఉపశమనాన్ని రద్దు చేయాలని కోరనున్నట్టు తెలిసింది. ఇక అక్రమంగా ఫోన్‌ ట్యాపింగ్‌ జరిగిందని, మావోయిస్టులకు సంబంధించినవిగా పేర్కొంటూ రాజకీయ నాయకుల ఫోన్లను ట్యాప్‌ చేశారని సిట్‌ ఇప్పటికే గుర్తించింది.


అందులోనూ ట్యాపింగ్‌కు అనుమతి కోరుతూ రివ్యూ కమిటీ దృష్టికి వెళ్లిన ఫోన్‌ నంబర్లు కొన్ని మాత్రమేనని... ఎస్‌ఐబీలో ఏర్పాటు చేసిన స్పెషల్‌ ఆపరేషన్‌ సెల్‌ వేల సంఖ్యలో ఫోన్లను ట్యాప్‌ చేసిందని తేల్చారు. ఇలా మావోయిస్టుల పేరిట రాజకీయ నాయకుల నంబర్లను ట్యాప్‌ చేసిన అంశంపై ప్రభాకర్‌రావును గురువారం పలుమార్లు ప్రశ్నించినా.. తగిన సమాధానం రాలేదని తెలిసింది. మరోవైపు ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో వాంగ్మూలాల నమోదు కోసం వికారాబాద్‌ జిల్లా తాండూరు ప్రాంతానికి చెందిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ధారాసింగ్‌, నేతలు డాక్టర్‌ సంపత్‌ కుమార్‌, ఆర్బీఎల్‌ శ్రీనివా్‌సరెడ్డి, మురళి గౌడ్‌, వడ్డె శ్రీనివా్‌సలకు సిట్‌ నుంచి పిలుపు వచ్చింది. ఇదే మండలానికి చెందిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడికి కూడా పిలుపు వచ్చినట్టు సమాచారం. వీరిలో ధారాసింగ్‌ 23వ తేదీన సిట్‌ ముందు హాజరుకానున్నట్టు తెలిపారు. మిగతా నలుగురిని ఎప్పుడు రావాలన్నది ఇంకా చెప్పలేదని వెల్లడించారు.


ఇవి కూడా చదవండి:

కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయతో లోకేష్ భేటీ

యోగాలో ప్రపంచ రికార్డు సృష్టిస్తాం..: మంత్రి సవిత

ఢిల్లీకి బయలుదేరిన సీఎం రేవంత్ రెడ్డి

For More AP News and Telugu News

Read Latest and Crime News

Updated Date - Jun 20 , 2025 | 04:05 AM