Electricity: నగరంలో నేడు విద్యుత్ ఉండని ప్రాంతాలివే..
ABN , Publish Date - Jul 17 , 2025 | 07:13 AM
విద్యుత్ మరమ్మతుల కారణంగా టీజీఎస్పీడీసీఎల్ బాలాజీనగర్ వసంతనగర్ పరిధిలో గురువారం పలు ప్రాంతాల్లో కరెంట్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు ఏఈ భీమాలింగప్ప బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు.
హైదరాబాద్: విద్యుత్ మరమ్మతుల కారణంగా టీజీఎస్పీడీసీఎల్ బాలాజీనగర్ వసంతనగర్(TGSPDCL Balajinagar Vasanthanagar) పరిధిలో గురువారం పలు ప్రాంతాల్లో కరెంట్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు ఏఈ భీమాలింగప్ప బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. హబీబ్‌నగర్, హిమని కన్‌స్ట్రక్షన్, ఆంజనేయనగర్, మూసాపేట్ పెట్రోల్ బంకు నుంచి ఐడీఎల్ లేక్ వరకు ఉదయం 10 నుంచి 11 గంటల వరకు, బాలాజీనగర్, సాయిబాబా టెంపుల్, రాందేవ్‌రావు హాస్పిటల్, పీపుల్స్ హాస్పిటల్, వివేక్‌నగర్, న్యూ బాలాజీనగర్, కమ్యూనిటీహాల్, హనుమాన్ టెంపుల్, యోగ్యతా అపార్ట్‌మెంట్ ప్రాంతాల్లో మధ్యాహ్నం 2 నుంచి సాయత్రం 5 గంటల వరకు విద్యుత్ ఉండదని ఆయన పేర్కొన్నారు.
చిక్కడపల్లి: ఆజామాబాద్ డివిజన్ పరిధిలో గురువారం విద్యుత్ సరఫరా ఉండదని ఏడీఈ జి.నాగేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. డీడీహెచ్ పరిధిలోని విజ్ఞాన్‌పురి కాలనీ, వీఎస్టీ మెయిన్‌రోడ్ తదితర ప్రాంతాల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, నల్లకుంట పరిధిలోని భారత్ ఇన్‌స్టిట్యూట్, విజయాబ్యాంక్ తదితర ప్రాంతాల్లో మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదని పేర్కొన్నారు.
బిట్స్ పిలానీ: డెంటల్ కాలేజీ వద్ద గల 11 కేవీ ఫీడర్ పరిధిలో చెట్ల కొమ్మలను కత్తిరించడం, విద్యుత్ మెయింటనెన్స్ పనుల కారణంగా పలు ప్రాంతాల్లో గురువారం విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు బాలాజీనగర్ విద్యుత్ ఏఈ సాంబశివరావు తెలిపారు. సేవాలాల్ తండా, భగత్‌సింగ్ కాలనీ, గబ్బిలాల్‌పేట్, శాంతినగర్, రాజీవ్‌నగర్ కాలనీ ప్రాంతాల్లో ఉదయం 10 గంటల నుంచి ఒంటి గంట వరకు, 11 కేవీ సంతోష్ నగర్ ఫీడర్‌లోని సంతోషఫ నగర్, చెన్నాపురం చౌరస్తా, బీజేఆర్‌నగర్, పాపయ్యనగర్, నందమూరి నగర్, సత్యనారాయణ కాలనీ, మల్లికార్జున్‌నగర్, దుర్గా భవానీనగర్ కాలనీ, జ్యోతిరావ్ కాలనీ ప్రాంతాల్లో మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదని తెలిపారు. వినియోగదారులు సహకరించాలని ఏఈ కోరారు.

గాజులరామారం: గాజులరామారం విద్యుత్ సబ్‌స్టేషన్ పరిధిలోని ఈ కింది ప్రాంతాల్లో గురువారం విద్యుత్ సరఫరా ఉండ దని ఏఈ చైతన్యభార్గవ్ తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఉషోదయకాలనీ ఫేజ్-1లో కరెంట్ ఉండదన్నారు. మధ్యా హ్నం 3 నుంచి సాయంత్రం 4 గంటల వరకు శ్రీవెన్ ఎన్‌క్లేవ్, ఆదర్శనగర్, దేవభూమినగర్, మెట్టుకానిగూడ గ్రామం, అయ్యప్ప స్వామి దేవాలయం, ఓక్షిత ఎన్‌క్లేవ్, వీనస్ ఎన్‌క్లేవ్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఉండన్నారు.
రాయదుర్గం: విద్యుత్ మరమ్మతుల కారణంగా ఏపీహెచ్‌బీ 11కేవీ విద్యుత్ పీడర్ పరిధిలో గురువారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, జయభేరి ఎన్‌క్లేవ్ ఫీడర్ పరిధిలోని జయభేరిఎన్‌క్లేవ్, ఏపీహెచ్‌బీ కాలనీ, ఓల్డ్ గచ్చిబౌలి, మెరిడియన్ ప్రాంతాల్లో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ ఉండదని ఏఈ తెలిపారు. విద్యుత్ వినియోగదారులు సహకరించాలని ఏఈ కోరారు.
ఈ వార్తలు కూడా చదవండి.
తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
తాటి చెట్టే లేదు.. లక్షల లీటర్ల కల్లా..
Read Latest Telangana News and National News