Electricity: ఆ ఏరియాల్లో.. 10 గంటల నుంచి కరెంట్ కట్.. కారణం ఏంటంటే..
ABN , Publish Date - Oct 23 , 2025 | 07:09 AM
టీజీఎస్పీడీసీఎల్ బాలాజీనగర్ సెక్షన్ పరిధిలో ఫీడర్ మరమ్మతుల నేపథ్యంలో గురువారం పలు ప్రాంతాల్లో కరెంట్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ భీమలింగప్ప ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మూసాపేట్ వార్డు కార్యాలయం పరిసర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఉండదని పేర్కొన్నారు.
- నగరంలో నేడు విద్యుత్ ఉండని ప్రాంతాలు
హైదరాబాద్: టీజీఎస్పీడీసీఎల్ బాలాజీనగర్ సెక్షన్(TGSPDCL Balajinagar Section) పరిధిలో ఫీడర్ మరమ్మతుల నేపథ్యంలో గురువారం పలు ప్రాంతాల్లో కరెంట్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ భీమలింగప్ప(AE Bhimalingappa) ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మూసాపేట్ వార్డు కార్యాలయం, గూడ్స్‌షెడ్ రోడ్డు(Goods Shed Road), యాదవ బస్తీ, అంబేడ్కర్‌నగర్, ఎస్పీ నగర్, జేపీ నగర్ పరిసర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఉండదని పేర్కొన్నారు.

నేడు విద్యుత్ ఉండని ప్రాంతాలు..
చిక్కడపల్లి: ఆజామాబాద్ డివిజన్, హైదరాబాద్-2(Azamabad Division, Hyderabad-2) పరిధిలోని పలు ప్రాంతాల్లో గురువారం విద్యుత్ సరఫరా ఉండదని సీబీడీ ఏడీఈలు నాగేశ్వరరావు, వినోద్‌కుమార్‌లు తెలిపారు. శివం, హర్రాజ్‌పెంట, పార్శిగుట్ట, జగదీశ్ మార్కెట్, గోల్కొండ 11 కేవీ విద్యుత్ ఫీడర్ల పరిధిలో ఉదయం 10నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, బౌద్ధనగర్, శివాలయం, ఆర్టీసీ క్రాస్‌రోడ్డు(RTC Crossroad), టీటీడీ, లేక్‌ప్లాజా(పార్క్ హోటల్) పరిధిలో మధ్యాహ్నం 2నుంచి సాయంత్రం 5గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. బంగారం ధర మరింత తగ్గింది..
మావోయిస్టు మద్దతుదారులపై నజర్!
Read Latest Telangana News and National News