Share News

POLYCET Results: పాలిసెట్‌ ఫలితాలు విడుదల

ABN , Publish Date - May 25 , 2025 | 04:00 AM

పాలిటెక్నిక్‌లలో ప్రవేశాలకు ఉద్దేశించిన పాలిసెట్‌ ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ శ్రీదేవసేన ఈ ఫలితాలను విడుదల చేశారు.

POLYCET Results: పాలిసెట్‌ ఫలితాలు విడుదల

  • ఎంపీసీ విభాగంలో 82శాతం, ఎంబైపీసీ విభాగంలో 84శాతం ఉత్తీర్ణత

  • 100 శాతం మార్కులతో స్టేట్‌ ఫస్ట్‌ ర్యాంకు సాధించిన నలుగురు విద్యార్థులు

హైదరాబాద్‌, హైదరాబాద్‌ సిటీ, ఖమ్మం ఖానాపురంమవేలి, మహబూబ్‌నగర్‌ విద్యా విభాగం, సూర్యాపేట అర్బన్‌, చిలుకూరు, మే 24 (ఆంధ్రజ్యోతి): పాలిటెక్నిక్‌లలో ప్రవేశాలకు ఉద్దేశించిన పాలిసెట్‌ ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ శ్రీదేవసేన ఈ ఫలితాలను విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 98,858 మంది పరీక్షకు హాజరుకాగా.. ఎంపీసీ విభాగంలో 80,949 (81.88ు) మంది ఉత్తీర్ణత సాధించారు. ఎంబైపీసీ విభాగంలో 83,364 (84.33ు) మంది ఉత్తీర్ణులయ్యారు. ఎంపీసీ విభాగంలో గోరుగంటి శ్రీజ (మిర్యాల-సూర్యాపేట జిల్లా), తూమాటి లాస్యశ్రీ (ఖమ్మం), ఉండ్యాల కౌశిక్‌ నారాయణ (మహబూబ్‌నగర్‌), వీసవరం దీక్షిక (హైదరాబాద్‌) 120 మార్కులకు 120 సాధించి సంయుక్తంగా రాష్ట్రంలో మొదటి ర్యాంకును సాధించారు.


అలాగే ఎంబైపీసీ విభాగంలోనూ గోరుగంటి శ్రీజ, తూమాటి లాస్యశ్రీ 150 మార్కులకు 150 సాధించి సంయుక్తంగా మొదటి ర్యాంకులు పొందారు. ఎంబైపీసీ విభాగంలో కాచిగూడలోని నెహ్రూనగర్‌కు చెందిన మహ్మద్‌ అశ్వఖ్‌కు స్టేట్‌ 5వ ర్యాంకు వచ్చింది. హైదరాబాద్‌ మియాపూర్‌లోని జనప్రియనగర్‌కు చెందిన బుద్ధ నాగసౌఖ్య ఎంపీసీ విభాగంలో స్టేట్‌ 9వ ర్యాంకు పొందారు. సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన ప్రణవి రాష్ట్రస్థాయిలో ఎంపీసీ విభాగంలో 9వ ర్యాంకు సాధించారు. సూర్యాపేట జిల్లా చిలుకూరు మండల కేంద్రానికి చెందిన షేక్‌ ఇఫ్రా తస్నీమ్‌ ఎంపీసీ విభాగంలో 120 మార్కులకు 119 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో ఐదో ర్యాంకు, ఎంబైపీసీ విభాగంలో 150 మార్కులకు 149 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో 3వ ర్యాంక్‌ సాధించారు.


ఇవి కూడా చదవండి

Government Doctor: భార్యను పుట్టింటికి పంపించి.. వేరే మగాళ్లతో ఇంట్లో ఆ వీడియోలు..

Telangana: కవిత చెప్పిన దెయ్యాలు వారే.. సామ సంచలన కామెంట్స్..

Updated Date - May 25 , 2025 | 04:00 AM