Hyderabad: రంగు నీళ్లతో బస్తీ వాసుల పరేషాన్...
ABN , Publish Date - Aug 07 , 2025 | 07:26 AM
నాలాలో కలుషిత జలాలు ప్రజలను కలవర పెట్టాయి. మురుగు నీటి కాలువలో నీరు ఎర్రగా మారడంతో రసాయన జలాలు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియక ఆందోళన చెందుతున్నారు. బంజారాహిల్స్ రోడ్డు నంబరు 10 సింగాడి బస్తీ నుంచి తాజ్ బంజారా వరకు ఉన్న నాలాలో బుధవారం ఎర్రటి నీటి ప్రవహించింది.
- నాలా పరిసర వాసుల్లో కలవరం.. అంబేడ్కర్ నాలా నుంచి
- బంజారా చెరువులో కలుస్తున్న కలుషిత జలాలు
హైదరాబాద్: నాలాలో కలుషిత జలాలు ప్రజలను కలవర పెట్టాయి. మురుగు నీటి కాలువలో నీరు ఎర్రగా మారడంతో రసాయన జలాలు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియక ఆందోళన చెందుతున్నారు. బంజారాహిల్స్ రోడ్డు నంబరు 10 సింగాడి బస్తీ(Banjara Hills Road No. 10 Singadi Basti) నుంచి తాజ్ బంజారా వరకు ఉన్న నాలాలో బుధవారం ఎర్రటి నీటి ప్రవహించింది. ఈ కలుషిత నీరు బంజారా చెరువులో కలుస్తోంది. రోడ్డు నంబరు 14 నూర్‌నగర్, నందినగర్(Nandinagar)లో దుస్తుల డైయింగ్ కేంద్రాలు అనేకం ఉన్నాయి.
వారు వ్యర్థాలను డ్రైనేజీలోకి వదిలేస్తున్నారు. గతంలో స్థానికంగా ఉన్న బోర్‌వెల్(Borewell)ల నుంచి కూడా రంగు నీరు వస్తుందనే ఫిర్యాదులు ఉన్నాయి. డైయింగ్ కేంద్రాల నుంచి వ్యర్థాలు నాలాలో కలిసి నీరు రంగు మారుతుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇలా రంగునీరు కనిపించడం ఇది మొదటిసారి కాదంటున్నారు. నీరు రంగు మారడంపై జలమండలికి ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మరింత పెరిగిన బంగారం ధర.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
దొంగ డెత్ సర్టిఫికెట్‌తో ఎల్‌ఐసీకి టోకరా
Read Latest Telangana News and National News