Pidamarthi Ravi: మందకృష్ణ బీజేపీ ఏజెంట్
ABN , Publish Date - Feb 07 , 2025 | 03:33 AM
మందకృష్ణకు ఎస్సీ వర్గీకరణ ఇష్టం లేదని మాదిగ జేఏసీ ఫౌండర్ చైర్మన్ పిడమర్తి రవి అన్నారు. ఎమ్మార్పీఎస్ ఉద్యమాన్ని అడ్డం పెట్టుకుని, 30 ఏళ్లుగా రాజకీయ పార్టీలతో లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకుని రూ.500 కోట్ల ఆస్తులు సంపాదించాడని విమర్శించారు.

ఆయనకు వర్గీకరణ ఇష్టం లేదు
ఉద్యమం పేరుతో రూ.కోట్లు పోగేశారు: పిడమర్తి రవి
ఉప్పల్, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): మందకృష్ణకు ఎస్సీ వర్గీకరణ ఇష్టం లేదని మాదిగ జేఏసీ ఫౌండర్ చైర్మన్ పిడమర్తి రవి అన్నారు. ఎమ్మార్పీఎస్ ఉద్యమాన్ని అడ్డం పెట్టుకుని, 30 ఏళ్లుగా రాజకీయ పార్టీలతో లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకుని రూ.500 కోట్ల ఆస్తులు సంపాదించాడని విమర్శించారు. మందకృష్ణ బీజేపీ ఏజెంట్‌లా పనిచేస్తున్నారని, మాదిగ జాతిని మనువాదం వైపు, రిజర్వేషన్లు అంటేనే గిట్టని బీజేపీ వైపు మళ్లించేందుకు కుట్ర చేస్తున్నాడని మండిపడ్డారు. మాదిగ జేఏసీ ఆధ్వర్యంలో ఉప్పల్‌లో ఏర్పాటు చేసిన రేవంత్‌రెడ్డి అభినందన సభలో రవి మాట్లాడారు.
వర్గీకరణకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదంతో మందకృష్ణకు ఏ పనీ లేకుండా పోయిందన్నారు. అందుకే తన పబ్బ గడుపుకునేందుకు 11 శాతం రిజర్వేషన్లు కావాలంటూ కొత్త రాగం ఎత్తుకున్నాడని ధ్వజమెత్తారు. మోదీని ఒప్పించి, ఎస్సీ వర్గీకరణ బిల్లును పార్లమెంటులో పాస్ చేయిస్తేనే మందకృష్ణను ప్రజలు నమ్ముతారని పేర్కొన్నారు. రేపటి నుంచి మాదిగ జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మండల, జిల్లా, నియోజకవర్గ కేంద్రాల్లో మాదిగలు సీఎం రేవంత్‌రెడ్డి అభినందన సభలు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు.