Share News

Prabhakar Rao: క్యాన్సర్‌తో బాధపడుతున్నా.. బెయిల్‌ ఇవ్వండి

ABN , Publish Date - Apr 26 , 2025 | 04:09 AM

ముందస్తు బెయిల్‌ ఇవ్వాలంటూ ఫోన్‌ట్యాపింగ్‌ కేసు నిందితుడు ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌రావు చేసిన వినతిపై శుక్రవారం హైకోర్టులో వాదోపవాదాలు జరిగాయి. క్యాన్సర్‌తో బాధపడుతున్నానని ముందస్తు బెయిల్‌ ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Prabhakar Rao: క్యాన్సర్‌తో బాధపడుతున్నా.. బెయిల్‌ ఇవ్వండి

  • ఫోన్‌ట్యాపింగ్‌ కేసులో ప్రభాకర్‌రావు వాదన

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 25 (ఆంధ్రజ్యోతి): ముందస్తు బెయిల్‌ ఇవ్వాలంటూ ఫోన్‌ట్యాపింగ్‌ కేసు నిందితుడు ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌రావు చేసిన వినతిపై శుక్రవారం హైకోర్టులో వాదోపవాదాలు జరిగాయి. క్యాన్సర్‌తో బాధపడుతున్నానని ముందస్తు బెయిల్‌ ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ వాదనలను పోలీసులు ఖండించారు. ఆయన చెప్పేవి సాకులని, వ్యక్తిగత లాభం కోసం ఫోన్‌ ట్యాపింగ్‌ను వినియోగించుకున్నందున బెయిల్‌ ఇవ్వవద్దని కోరారు. ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై జస్టిస్‌ జె.శ్రీనివా్‌సరావు ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రభాకరరావు తరఫున సీనియర్‌ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. 65 ఏళ్ల వయసులో ఆయన క్యాన్సర్‌ వ్యాధితో బాధపడుతున్నారని చెప్పారు.


ముందస్తు బెయిల్‌ మంజూరు చేస్తే వెంటనే హైదరాబాద్‌కు వచ్చి దర్యాప్తునకు సహకరిస్తారని చెప్పారు. ఈ వాదనను ప్రభుత్వం తరఫున హాజరైన సీనియర్‌ న్యాయవాది సిద్థార్థ్‌ లూద్రా వాదనలు ఖండించారు. పాస్‌పోర్టు రద్దుకావడం, రెడ్‌ కార్నర్‌ నోటీసులు జారీ కావడం వల్లనే భారత్‌కు వస్తున్నారే తప్ప, తనంతటతానుగా కాదని చెప్పారు. వయసును సాకుగా చూపించి దర్యాప్తు నుంచి తప్పించుకోలేరని అన్నారు. క్యాన్సర్‌తో బాధపడుతుంటే పదవీ విరమణ తర్వాత ఓఎ్‌సడీగా ఎలా కొనసాగారని ప్రశ్నించారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. తదుపరి విచారణ ఈ నెల 29కు వాయిదా వేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

సీటీ స్కాన్‌లో బయటపడ్డ షాకింగ్ విషయం..

వృద్ధిరేటులో ఏపీ రాష్ట్రానికి రెండో స్థానం

పేదవారి కళ్లలో.. ఆనందం చూశా

For More AP News and Telugu News

Updated Date - Apr 26 , 2025 | 04:09 AM