Share News

Paddy Procurement: 1 నుంచి ధాన్యం కొనుగోళ్లు

ABN , Publish Date - Sep 09 , 2025 | 03:49 AM

వానాకాలం ఖరీఫ్‌ సీజన్‌లో రైతులు పండించిన వడ్లను కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమవుతోంది. భారత ఆహార సంస్థ ఎఫ్‌సీఐ మార్గదర్శకాల ప్రకారం ఖరీఫ్‌ ధాన్యం...

Paddy Procurement: 1 నుంచి ధాన్యం కొనుగోళ్లు

  • కోటి టన్నుల దాకా వస్తుందని అంచనా

  • 8వేల కొనుగోలు కేంద్రాల ఏర్పాటు

  • ప్రక్రియపై చర్చించేందుకు నేడు రాష్ట్రానికి ఎఫ్‌సీఐ బృందం

  • ఈనెల 16న క్షేత్రస్థాయి అధికారులతో టీజీసీఎస్‌ సమావేశం

  • 62 లక్షల ఎకరాల్లో వరిసాగు

  • ఇందులో 60శాతానికి పైగా సన్నాలే

హైదరాబాద్‌, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి): వానాకాలం (ఖరీఫ్‌) సీజన్‌లో రైతులు పండించిన వడ్లను కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమవుతోంది. భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) మార్గదర్శకాల ప్రకారం ఖరీఫ్‌ ధాన్యం సేకరణ అక్టోబరు 1న మొదలవ్వాలి. ఈ మేరకు ఎఫ్‌సీఐ నుంచి రాష్ట్ర సర్కారుకు ఆదేశాలు కూడా వచ్చాయి. ఈ క్రమంలో అదే తేదీ నుంచి.. వీలైతే కాస్త ముందుగానే, అంటే ఈనెల 25న ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించేందుకు రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ (టీజీసీఎస్‌) ఏర్పాట్లు చేస్తోంది. ఖరీ్‌ఫలో 62 లక్షల పైచిలుకు ఎకరాల్లో రైతులు వరిసాగు చేశారు. కోటిన్నర మెట్రిక్‌ టన్నుల మేర వడ్ల దిగుబడి వస్తుందని అంచనా వేశారు. ఇందులో కోటి మెట్రిక్‌ టన్నుల వడ్లు కొనుగోలు కేంద్రాలకు రావొచ్చునని భావిస్తున్నారు. ధాన్యం కొనుగోళ్ల కోసం రాష్ట్రవ్యాప్తంగా 8 వేల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేయనున్నారు. ఉమ్మడి నిజామాబాద్‌, నల్లగొండ జిల్లాల్లో సీజన్‌లో కాస్త ముందుగానే నాట్లు పడ్డాయి కాబట్టి అక్కడ త్వరగా పంట చేతికొస్తుంది. ఫలితంగా బాన్సువాడ, బోధన్‌, మిర్యాలగూడ తదితర చోట్ల సెప్టెంబరు చివరి వారంలోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేయాలనే డిమాండ్‌ వస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆయాచోట్ల కాస్త ముందుగానే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించే అవకాశాలున్నాయి. కాగా ఖరీఫ్‌ కొనుగోళ్ల ప్రక్రియపై చర్చించేందుకు ఎఫ్‌సీఐ నుంచి ఉన్నతాధికారుల బృందం మంగళవారం హైదరాబాద్‌కు వస్తోంది. ఈ బృందం.. ఎఫ్‌సీఐ హైదరాబాద్‌ ప్రాంతీయ అధికారులు, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ, కార్పొరేషన్‌ అధికారులు హాజరవుతున్నారు. వరిసాగు ఎక్కువగా జరిగిన 16 జిల్లాలకు చెందిన అధికారులు కూడా ఈ సమావేశానికి పిలిచారు. జిల్లా అదనపు కలెక్టర్లు, డీఎ్‌సవోలు, మేనేజర్లు, జనరల్‌ మేనేజర్లతో ఖరీఫ్‌ ధాన్యం సేకరణకు సంబంధించిన అంశాలపై వర్క్‌షాప్‌ నిర్వహించనున్నారు. ఈనెల 16 తేదీన డాక్టర్‌ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో ఖరీఫ్‌ ధాన్యం సేకరణ ప్రణాళికపై చర్చించటానికి కమిషనర్‌ డీఎస్‌ చౌహాన్‌ ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల అడిషనల్‌ కలెక్టర్లు, జిల్లా పౌరసరఫరాల సంస్థ మేనేజర్లు, జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారులు, ఇతర అధికారులతో చర్చించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.


యాసంగి బోనస్‌ ఎప్పుడు?

2025-26 సీజన్‌కు సంబంధించి కేంద్ర సర్కారు కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ)ని ప్రకటించింది. ఈ మేరకు సాధారణ రకానికి క్వింటాకు రూ.2,369 చొప్పున, గ్రేడ్‌-ఏ ఽధాన్యానికి రూ.2,389 చొప్పున రైతులకు చెల్లిస్తారు. సన్నరకాలకు క్వింటాకు రూ.500 చొప్పున బోన్‌సను రాష్ట్ర సర్కారు చెల్లిస్తోంది. గత యాసంగి సీజన్‌కు సంబంఽధించి బోన్‌సను ఇప్పటికీ సర్కారు రైతులకు చెల్లించలేదు. దీనిపై అన్నదాతల్లో ఆందోళన నెలకొంది. యాసంగితో పోలిస్తే ఖరీ్‌ఫలో సన్నాలను రైతులు ఎక్కువగా సాగుచేస్తారు. ఈ ఖరీ్‌ఫలో సాగైన వరిలో 60శాతంపైగా సన్న రకాలే కావడం గమనార్హం. ఈ క్రమంలో వానాకాలం సీజన్‌కు సంబంధించి బోన్‌సపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన వెలువడాల్సి ఉంది.


ఇవి కూడా చదవండి..

ఉప రాష్ట్రపతి ఎన్నికలో తొలి ఓటు వేసేది ఎవరంటే..

రేపే ఉపరాష్ట్రపతి ఎన్నిక

For More National News And Telugu News

Updated Date - Sep 09 , 2025 | 03:49 AM