Share News

Asaduddin Owaisi: స్వాతంత్య్ర పోరాటంలో ముస్లింల పాత్రను విస్మరించారు

ABN , Publish Date - Aug 15 , 2025 | 05:09 AM

దేశ స్వాతంత్య్ర పోరాటంలో ముస్లింలు కూడా ప్రధాన పాత్ర పోషించారని, అయితే పాలకులు చరిత్రను విస్మరించారని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ చెప్పారు.

Asaduddin Owaisi: స్వాతంత్య్ర పోరాటంలో ముస్లింల పాత్రను విస్మరించారు

  • నేతాజీ అనుచరుడైన హసన్‌ సత్రానీని పాలకులు పట్టించుకోలేదు

  • జైహింద్‌ నినాదం ఇచ్చిన సత్రానీ హైదరాబాదీ:అసదుద్దీన్‌

బర్కత్‌పుర, ఆగస్టు 14(ఆంధ్రజ్యోతి): దేశ స్వాతంత్య్ర పోరాటంలో ముస్లింలు కూడా ప్రధాన పాత్ర పోషించారని, అయితే పాలకులు చరిత్రను విస్మరించారని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ చెప్పారు. ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాడుతూ ప్రాణత్యాగం చేసిన ముస్లింల చరిత్ర లేకపోవడం బాధాకరమన్నారు. నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ స్థాపించిన అజాద్‌ హింద్‌ ఫౌజ్‌లో కీలక పాత్ర పోషించి, జై హింద్‌ నినాదం ఇచ్చిన అబిద్‌ హసన్‌ సత్రాని హైదరాబాదీయేనని ఒవైసీ గుర్తుచేశారు. నేతాజీ ముఖ్య అనుచరుడిని కూడా పాలకులు విస్మరించారని చెప్పారు. బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ కౌన్సిల్‌ ఆఫ్‌ హిస్టారికల్‌ రిసర్చ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సుకు ఒవైసీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.


రిజర్వేషన్లపై అఖిలపక్ష భేటీ పెట్టాలి: జాజుల

హైదరాబాద్‌, ఆగస్టు 14(ఆంధ్రజ్యోతి): బీసీ రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అఖిలపక్ష పార్టీలు, బీసీ సంఘాలు, మేధావులతో సమావేశం ఏర్పాటు చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌ గౌడ్‌ డిమాండ్‌ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కేటాయిస్తూ చట్టం చేసే విషయంలో బీజేపీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని జాజుల విమర్శించారు. ఇందులో ముస్లింలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నారనే తప్పుడు ప్రచారంతో బీజేపీ బీసీల్లో గందరగోళ వాతావరణాన్ని సృష్టించే విధానాన్ని ఎండగడుతూ కేంద్రంపై ఒత్తిడి పెంచడానికి తక్షణం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని జాజుల కోరారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పోలీసుల విద్యార్హతపై.. డీజీపీ కీలక వ్యాఖ్యలు

సీఎంపై ప్రశంసలు.. ఎమ్మెల్యేను బహిష్కరించిన పార్టీ

Updated Date - Aug 15 , 2025 | 05:10 AM