EAPCET: తొలి రోజు ఎప్‌సెట్‌కు 5,010 దరఖాస్తులు
ABN , Publish Date - Mar 02 , 2025 | 05:13 AM
ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఎప్‌సెట్-2025కు తొలిరోజు 5,010 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.
హైదరాబాద్/హైదరాబాద్ సిటీ, మార్చి 1 (ఆంధ్రజ్యోతి): ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఎప్‌సెట్-2025కు తొలిరోజు 5,010 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. మూడేళ్లలో మొదటి రోజే ఈస్థాయిలో దరఖాస్తులురావడం ఇదే ప్రథమం. శనివారం ఉదయం 11.45 గంటలకు ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణను ఎప్‌సెట్ అధికారులు ప్రారంభించారు.
ఇంజనీరింగ్ స్ట్రీమ్‌కు 3,116, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్ట్రీమ్‌కు 1,891, రెండింటికీ ముగ్గురు అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించినట్లు ఎప్‌సెట్ కన్వీనర్ తెలిపారు. టీజీఎ్‌పసెట్‌కు ఈ ఏడాది నుంచి ఏపీ అభ్యర్థులకు అవకాశం లేకపోవడంతో గతేడాదికంటే సుమారు 50-70వేల వరకు దరఖాస్తులు తగ్గే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.