Share News

Telangana SIT Investigation:ఏపీ మద్యం కేసు..శ్రవణ్‌రావుకు నోటీసులు!

ABN , Publish Date - Jul 23 , 2025 | 06:34 AM

తెలంగాణలో ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో నిందితుడిగా ఉన్న శ్రవణ్‌రావుకు ఆంధ్రప్రదేశ్‌ మద్యం కుంభకోణంలో

Telangana SIT Investigation:ఏపీ మద్యం కేసు..శ్రవణ్‌రావుకు నోటీసులు!

  • శ్రవణ్‌, ఆకర్ష్‌ ఫ్లాట్‌లోనే..లిక్కర్‌ స్కామ్‌ నిందితులు

  • ఆధారాలను సేకరించిన సిట్‌

హైదరాబాద్‌, జూలై 22 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో నిందితుడిగా ఉన్న శ్రవణ్‌రావుకు ఆంధ్రప్రదేశ్‌ మద్యం కుంభకోణంలో నోటీసులు జారీ అయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌ మద్యం కుంభకోణం కేసుతో సంబంధం ఉందంటూ తెలంగాణ ప్రాంతానికి చెందిన వారికి నోటీసులు రావడం ఇదే తొలిసారి. దుబాయ్‌లో శ్రవణ్‌ రావు, ఆకర్ష్‌ భాగస్వామ్యంలో కొనుగోలు చేసిన ఖరీదైన అపార్ట్‌మెంట్‌లోని ఫ్లాట్‌లో.. మద్యం కుంభకోణం నిందితులు మకాం వేశారు. ఈ క్రమంలో సిట్‌ మంగళవారం ఆకర్ష్‌ను విజయవాడలో విచారించింది. ఉదయం 11 నుంచి సాయంత్రం 7 గంటల వరకు.. సుమారు 8 గంటల పాటు ఆకర్ష్‌ను పలు కోణాల్లో ప్రశ్నించింది. ఫిబ్రవరి 27 నుంచి ఏప్రిల్‌ 27 వరకు 2 నెలలు ఆ ఫ్లాట్‌కు యజమానిగా శ్రవణ్‌రావు కోటాలో ఐదుగురు ఫ్లాట్‌లో ఉన్నారని ఆకర్ష్‌ చెప్పినట్లు తెలిసింది. ఆ సమయంలో ఫ్లాట్‌లో ఉన్న ఐదుగురిలో శ్రవణ్‌రావు ఒక్కరే తనకు తెలుసునని, మిగతా వారు ఎవరో తెలియదని చెప్పారు. ఆ ఐదుగురిలో ఉన్న చాణక్య బూనేటి ఏపీ మద్యం కుంభకోణంలో నిందితుడన్న విషయం తనకు తొలుత తెలియదన్నారు. మీడియాలో వచ్చిన కథనాలతోనే విషయం తెలిసిందన్నారు. చాణక్యతోపాటు మిగతా వారికి దుబాయ్‌లోని ఆ ఫ్లాట్‌లో యజమానిగా శ్రవణ్‌రావు కోటాలోనే వసతి కల్పించారన్న ఆధారాలు మీకు ఎక్కడి నుంచి వచ్చాయని ఆకర్ష్‌ను సిట్‌ ప్రశ్నించింది. దుబాయ్‌లో ఉన్న ఫ్లాట్‌లో తమ వాటాకు సంబంధించి ఆ దేశంలోనే ఉండే ఒక వ్యక్తికి తాము జీపీఏ ఇచ్చామని, ఆ వ్యక్తి అక్కడ ఆ ఫ్లాట్‌ను నిర్వహిస్తున్న డీలక్స్‌ హాలిడే హోమ్స్‌ నుంచి మొత్తం వివరాలు అడిగి తెలుసుకుని, తమకు ఇచ్చారని సిట్‌ అధికారులకు ఆకర్ష్‌ వివరించారు. దుబాయ్‌లో భాగస్వామ్యంతో ఫ్లాట్‌ కొనుగోలు చేసినప్పటి నుంచి శ్రవణ్‌ రావు తమను ఇబ్బందులకు గురిచేశారని సిట్‌ అధికారుల ఎదుట ఏకరువు పెట్టినట్లు సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో సిట్‌ అధికారులు శ్రవణ్‌రావును ప్రశ్నించేందుకు సిద్ధమవుతున్నారు.

పోస్టాఫీసుల్లో యూపీఐ చెల్లింపులు

రాష్ట్రంలోని అన్ని పోస్టాఫీసుల్లో యూపీఐతో చెల్లింపులు చేసే విధానం ఎట్టకేలకు అందుబాటులోకి వచ్చింది. ఈ మేరకు అడ్వాన్స్‌డ్‌ పోస్టల్‌ టెక్నాలజీ(ఏపీటీ) 2.0 సాంకేతికతను తెలంగాణ చీఫ్‌ పోస్ట్‌మాస్టర్‌ జనరల్‌ పీవీఎస్‌ రెడ్డి మంగళవారం ప్రారంభించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 32 ప్రధాన, 689 సబ్‌, 5006 బ్రాంచి పోస్టాఫీసుల్లో యూపీఐ చెల్లింపులు అందుబాటులోకి వస్తాయని ఆయన తెలిపారు. కాగా, వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు భారత తపాలా శాఖ దేశ వ్యాప్తంగా ఏపీటీ 2.0 పేరిట పోస్టాఫీసుల్లో నూతన అప్లికేషన్‌ను వినియోగంలోకి తీసుకువస్తోంది. ఇందులో భాగంగా పోస్టల్‌ శాఖ వినియోగిస్తున్న సాంకేతికత పరిజ్ఞానాన్ని కూడా ఏపీటీ2.0కు అప్‌గ్రేడ్‌ చేశారు. దీంతో యూపీఐ చెల్లింపులకు అవకాశం ఏర్పడింది. అలాగే,పార్సిళ్లకు సంబంధించిన అప్‌డేట్స్‌ ఇకపై వినియోగాదారుల మొబైల్‌కు వస్తాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

కోర్టును ఆశ్రయించిన మహిళ.. సీజేఐ ఆసక్తికర వ్యాఖ్యలు

ధన్‌ఖఢ్ రాజీనామా వెనుక నితీష్‌ను తప్పించే కుట్ర.. ఆర్జేడీ ఆరోపణ

మరిన్ని జాతీయతెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 23 , 2025 | 06:34 AM