Share News

NITI Aayog: తెలంగాణకు ఆర్థిక అనారోగ్యం

ABN , Publish Date - Jan 25 , 2025 | 04:07 AM

నీతి ఆయోగ్‌ శుక్రవారం విడుదల చేసిన ఆర్థిక ఆరోగ్య సూచిక ప్రకారం ఆర్థికంగా బలంగా ఉన్న రాష్ట్రాలలో తెలంగాణ 8వ స్థానం, ఆంధ్రప్రదేశ్‌ 17వ స్థానం దక్కించుకున్నాయి.

NITI Aayog: తెలంగాణకు ఆర్థిక అనారోగ్యం

  • నీతి ఆయోగ్‌ ఆర్థిక ఆరోగ్య సూచికలో 8వ స్థానం

  • వైసీపీ హయాంలో ఘోరంగా దెబ్బతిన్న ఏపీ.. సూచికలో 17వ స్థానం

న్యూఢిల్లీ, జనవరి 24(ఆంధ్రజ్యోతి): నీతి ఆయోగ్‌ శుక్రవారం విడుదల చేసిన ఆర్థిక ఆరోగ్య సూచిక ప్రకారం ఆర్థికంగా బలంగా ఉన్న రాష్ట్రాలలో తెలంగాణ 8వ స్థానం, ఆంధ్రప్రదేశ్‌ 17వ స్థానం దక్కించుకున్నాయి. మొదటి స్థానాన్ని సాధించిన ఒడిసా ఆర్థిక ఆరోగ్య సూచిక స్కోరు 67.8 కాగా, తెలంగాణ 43.6, ఏపీ 20.9 స్కోరును పొందాయి. జీడీపీలో వాటా, జనాభా, మొత్తం ప్రభుత్వ వ్యయం, ఆదాయాలు, ఆర్థిక సుస్థిరత ఆధారంగా నీతిఆయోగ్‌ ఈ సూచికను రూపొందించింది. తెలంగాణ రెవెన్యూ బలంగా పెరుగుతుండడం ప్రోత్సాహకరంగా ఉన్నప్పటికీ మూల ధన వ్యయాన్ని పెంచడంపై అత్యధికంగా దృష్టి సారించాల్సి ఉందని నీతి ఆయోగ్‌ హితవు చెప్పింది.


ముఖ్యంగా ఆరోగ్య, విద్యా రంగాలపై మూలధన వ్యయాన్ని పెంచాలని తెలిపింది. జీఎ్‌సడీపీ శాతంతో పోలిస్తే మూలధన వ్యయం 2018-19లో 17.6ు కాగా, 2022-23 నాటికి 9.3 శాతానికి తగ్గిపోయిందని తెలిపింది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆరోగ్య, విద్యా రంగాలలో తెలంగాణ అతి తక్కువ శాతం కేటాయించిందని తెలిపింది. తెలంగాణ ఆర్థిక లోటు లక్ష్యం జీఎ్‌సడీపీలో 5శాతానికి నిర్ణయించగా, 2022-23లో అది కేవలం 2.48ు రికార్డు చేసిందని తెలిపింది. అయితే ప్రభుత్వ రుణాలు మాత్రం గత అయిదేళ్లలో 11.9 నుంచి 19.1ు మధ్య ఉందని తెలిపింది. తెలంగాణ ఖర్చును సమర్థవంతంగా నిర్వహించలేకపోయినప్పటికీ, రెవెన్యూ సమీకరణలో గోవా తర్వాత రెండో స్థానంలో ఉన్నట్లు ఈ నివేదిక పేర్కొంది.

Updated Date - Jan 25 , 2025 | 04:07 AM