Hyderabad: వీసా.. పాస్‌పోర్టు లేని.. నైజీరియన్‌కు దేశ బహిష్కరణ
ABN , Publish Date - Feb 17 , 2025 | 01:36 AM
అతణ్ని డీపోర్ట్ చేయాలని నిర్ణయించారు. నైజీరియాకు చెందిన ఇకెచుకువు సిల్వెస్టర్ 2012లో బిజినెస్ వీసాపై భారత్‌కు వచ్చి.. ముంబై నుంచి వస్త్రాలను నైజీరియాకు ఎగుమతి చేసేవాడు.

హైదరాబాద్ సిటీ, ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి): వీసా, పాస్‌పోర్టుల్లేకుండా నగరంలో తిరుగుతున్న ఓ నైజీరియా దేశస్థుడిని అదుపులోకి తీసుకున్న హైదరాబాద్ నార్కోటిక్స్ వింగ్(హెచ్-న్యూ) పోలీసులు.. అతణ్ని డీపోర్ట్ చేయాలని నిర్ణయించారు. నైజీరియాకు చెందిన ఇకెచుకువు సిల్వెస్టర్ 2012లో బిజినెస్ వీసాపై భారత్‌కు వచ్చి.. ముంబై నుంచి వస్త్రాలను నైజీరియాకు ఎగుమతి చేసేవాడు. వీసా గడువు ముగిశాక కూడా ముంబైలోనే ఉండడంతో.. 2019లో పోలీసులు అరెస్టు చేశారు. రెండేళ్ల జైలులో శిక్ష తర్వాత తోటి నైజీరియా స్నేహితులు డ్రగ్స్ దందాలో ఉండగా.. వారికి ఉన్న లింకులతో సిల్వెస్టర్ ఇటీవల హైదరాబాద్ చేరుకున్నాడు.
ఇక్కడ అనుమానాస్పదంగా తిరుగుతుండడంతో.. పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సిల్వెస్టర్ వద్ద ఎలాంటి వీసా, పాస్‌పోర్టు లేవని పోలీసులు తెలిపారు. అతను డ్రగ్స్ పెడ్లర్‌గా మారుతున్న క్రమంలో గుర్తించడంతో.. నైజీరియాకు డీపోర్ట్ చేయాలంటూ నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ ఆదేశించారు. కాగా.. ఇప్పటి వరకు హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధుల్లో 16 మంది నైజీరియన్లను డీపోర్ట్ చేశారు.
Also Read:
గుడ్ న్యూస్.. డీఎస్సీ నోటిఫికేషన్ ఎప్పుడో చెప్పేసిన చంద్రబాబు..
భారీ స్కామ్.. పెట్టుబడుల పేరుతో రూ.850 కోట్లకు..
For More National News and Telugu News..