రేపు దేశవ్యాప్తంగా యూపీఎ్‌సపై నిరసనలు
ABN , Publish Date - Jan 27 , 2025 | 04:53 AM
ఆదివారం కేరళ రాష్ట్రంలోని కోజికోడ్ జిల్లా కేంద్రంలో ఆయన ఆధ్వర్యంలో స్టేట్ ఎన్‌పీఎస్ ఎంప్లాయీస్ కలెక్టివ్ సమక్షంలో క్విట్ ఎన్‌పీఎ్‌స-నో యూపీఎస్ మహా ర్యాలీ జరిగింది.
కేరళ మహా ర్యాలీలో స్థిత ప్రజ్ఞ పిలుపు
హైదరాబాద్, జనవరి 26 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ఆర్థిక శాఖ ఈ నెల 24న జారీ చేసిన యూనిఫైడ్ పెన్షన్ విధానం(యూపీఎస్) నోటిఫికేషన్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా మంగళవారం(28న) ఉద్యోగ, ఉపాధ్యాయ కార్యాలయాల్లో యూపీఎస్ ప్రతులు దగ్ధం చేయడంతోపాటు దేశవ్యాప్తంగా నిరసనలు తెలియజేయాలని ఎన్‌ఎంవోపీఎస్ సెక్రటరీ జనరల్ స్థిత ప్రజ్ఞ పిలుపునిచ్చారు. ఆదివారం కేరళ రాష్ట్రంలోని కోజికోడ్ జిల్లా కేంద్రంలో ఆయన ఆధ్వర్యంలో స్టేట్ ఎన్‌పీఎస్ ఎంప్లాయీస్ కలెక్టివ్ సమక్షంలో క్విట్ ఎన్‌పీఎ్‌స-నో యూపీఎస్ మహా ర్యాలీ జరిగింది.
తర్వాత స్టేడియం కార్నర్ వద్ద క్విట్ ఎన్‌పీఎస్ బహిరంగ సభ జరిగింది. ఈ సందర్భంగా స్థిత ప్రజ్ఞ మాట్లాడుతూ.. ఫిబ్రవరి 7న బెంగళూరు కేంద్రంగా ఫ్రీడం పార్కు వద్ద యూపీఎస్ వద్దంటూ ధర్నా చేపడతామన్నారు. మార్చి 2న హైదరాబాద్‌లో చలో ధర్నా చౌక్ పేరిట నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు.