Victims Attack House: రూ. 10 కోట్లు ఎగ్గొట్టిన మాయగాడి ఇంటిపై జనం దాడి, ఇల్లు దహనం
ABN , Publish Date - Oct 07 , 2025 | 07:37 PM
జనానికి మాయమాటలు చెప్పి వాళ్ల దగ్గర సొమ్ములు అడ్డంగా దోచేసి, తీరా ఇవ్వమంటే, ఏళ్లకేళ్లు తిప్పించుకుంటూ నరకయాతన పాలు చేసిన ఓ మాయగాడి ఇంటిపై బాధితులు దాడి చేశారు. ఫర్నీచర్ తగులబెట్టి, ఇళ్లు దగ్థం..
పడమటి తండా(నల్గొండ జిల్లా) అక్టోబర్ 7: నమ్మిన జనానికి మాయమాటలు చెప్పి వాళ్ల దగ్గర సొమ్ములు అడ్డంగా దోచేసి, తీరా ఇవ్వమంటే, ఏళ్లకేళ్లు తిప్పించుకుంటూ నరకయాతన పాలు చేసిన ఓ మాయగాడికి అప్పిచ్చిన వాళ్లంతా కలిసి గుణపాఠం చెప్పారు. అందరి దగ్గరా రూ. 10 కోట్లకు పైగా ఎగ్గొట్టిన సదరు ఘరానా చీటర్ ఇంటి పై బాధితుల దాడి చేశారు. ప్రజల సొమ్ములతో సుందరంగా కట్టుకున్న భవంతిని దహనం చేసేందుకు ఉపక్రమించారు. ఇంటికి నిప్పంటించారు.

నల్గొండ జిల్లా పెద్ద అడిశర్లపల్లి మండలంలోని పడమటి తండాలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రజలకి వడ్డీల ఆశ చూపి రూ. 10 కోట్లకు పైగా దోచేసి, తీరా తిరిగి సొమ్ములివ్వమంటే, వాటిని ఎగ్గొట్టి తిరుగుతున్న బాలాజీ నాయక్ అనే వడ్డీ వ్యాపారి ఇంటిపై బాధితులు కక్ష కొద్దీ రెచ్చిపోయారు. ఇంటి అద్దాలు పగులగొట్టి, ఫర్నీచర్ ధ్వంసం చేసి తగలబెట్టారు. కోర్టుకు పోయి ఐపీ పెట్టి 300 మందికి డబ్బులు ఇవ్వకుండా తప్పించుకు తిరుగుతున్న బాలాజీ నాయక్ ఇంటికి ఇవాళ ఉదయం పెద్ద ఎత్తున బాధితులు తరలి వచ్చి బాలాజీ నాయక్ ఇంటిపై దాడికి పాల్పడ్డారు.

ఈ వార్తలు కూడా చదవండి..
పీఎంఓ పేరిట మోసాలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్..!
Read Latest Telangana News And Telugu News