Share News

Nalgonda Constables Issue: వివాదాస్పదంగా ఇద్దరు కానిస్టేబుళ్ల వ్యవహారం..

ABN , Publish Date - Aug 05 , 2025 | 11:03 AM

నల్లగొండ జిల్లా తిప్పర్తిలో ఇద్దరు కానిస్టేబుళ్ల వ్యవహారం వివాదాస్పదంగా మారింది. సరైన పత్రాలు లేని, గంజాయి కేసుల్లో వదిలి వెళ్లిన బైకులను..

Nalgonda Constables Issue:  వివాదాస్పదంగా ఇద్దరు కానిస్టేబుళ్ల వ్యవహారం..
Nalgonda Constables Issue

నల్లగొండ జిల్లా : తిప్పర్తిలో ఇద్దరు కానిస్టేబుళ్ల వ్యవహారం వివాదాస్పదంగా మారింది. సరైన పత్రాలు లేని, గంజాయి కేసుల్లో వదిలి వెళ్లిన బైకును వారిద్దరూ అమ్మినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా డబ్బు కోసం బైక్‌ కొనుగోలు చేసిన వ్యక్తిని తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే..


ఒక వ్యక్తి ఇటీవల పోలీసుల వద్ద నుండి ఒక బైక్‌ను కొనుగోలు చేశాడు. అయితే, అతడు మొత్తం డబ్బు చెల్లించకముందే కానిస్టేబుళ్లు బైక్‌ను అప్పగించినట్లు తెలుస్తోంది. కానీ, తర్వాత.. ఇవాల్సిన సగం డబ్బు కోసం ఇద్దరు కానిస్టేబుళ్లు తీవ్ర ఒత్తిడి తెచ్చారని బాధితుడు ఆరోపిస్తున్నాడు. పైగా, బైక్‌కు సంబంధించి ఎటువంటి అధికారిక పత్రాలు అందించలేదని అతను పేర్కొన్నాడు.


ఈ విషయమై బాధితుడు తిప్పర్తి పోలీస్ స్టేషన్‌లో అధికారికంగా ఫిర్యాదు చేయగా, అసలు విషయం బయటపడింది. ఫిర్యాదులో, బైక్‌కు సంబంధించి పత్రాలు లేకపోవడమే కాకుండా, ఒత్తిడితో వేదింపులకు గురయ్యానని బాధితుడు తెలిపాడు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు స్పందించి, ఇద్దరు కానిస్టేబుళ్ల తీరుపై అంతర్గత విచారణ ప్రారంభించినట్టు తెలుస్తోంది. అయితే, విచారణ పూర్తయ్యే వరకు, సంబంధిత అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.


Also Read:

గుడ్ న్యూస్.. వందే భారత్ టిక్కెట్లను బయలుదేరే 15 నిమిషాల ముందు వరకూ బుక్ చేసుకోవచ్చు

వర్షాకాలం..ఉతికిన బట్టలు వాసన రాకుండా ఉండాలంటే ఈ టిప్స్ మర్చిపోకండి.!

For More Latest News

Updated Date - Aug 05 , 2025 | 11:19 AM