Share News

Yadadri: బాబోయ్ దారుణం.. కన్న తండ్రే కాలయముడు అయ్యాడు..

ABN , Publish Date - Feb 09 , 2025 | 06:04 PM

తెలంగాణ: చౌటుప్పల్ మండలం ఆరేగూడెంలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ బాలుడి విషయంలో కన్న తండ్రే కాలయముడు అయ్యాడు. చిన్న పొరపాటుకు ఆగ్రహించిన సదరు తండ్రి తీరు కుమారుడి ప్రాణాలు పోయేలా చేసింది.

Yadadri: బాబోయ్ దారుణం.. కన్న తండ్రే కాలయముడు అయ్యాడు..
Father Attack on Son

యాదాద్రి: ఓ తండ్రి చేసిన పని ఇప్పుడు అందరి కంటా కన్నీరు తెప్పిస్తోంది. కుమారుడు చేసిన చిన్నతప్పుకు అతని వేసిన శిక్ష చూసి గ్రామస్థులంతా శోకసంద్రంలో ముగిపోతున్నారు. 14 ఏళ్లపాటు కనీపెంచిన కొడుకు విషయంలో అతను ప్రవర్తించిన తీరు చూసి అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. ఇలాంటి తండ్రి ఎవ్వరికీ ఉండకూడదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన ఇప్పుడు స్థానికంగా విషాద ఛాయలు కమ్ముకునేలా చేసింది.


చౌటుప్పల్ మండలం ఆరేగూడెంలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ బాలుడి విషయంలో కన్న తండ్రే కాలయముడు అయ్యాడు. చిన్న పొరపాటుకు ఆగ్రహించిన సదరు తండ్రి తీరు కుమారుడి ప్రాణాలు పోయేలా చేసింది. గ్రామానికి చెందిన కట్ట భాను(14) ఓ ప్రైవేటు పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. స్కూల్‌లో అవార్డ్ ఫంక్షన్ ఉండడంతో రాత్రి ఇంటికి వెళ్లే సరికి ఆలస్యం అయ్యింది. అయితే ఇంటికి వచ్చిన కుమారుడిపై తండ్రి సైదులు విచక్షణారహితంగా దాడి చేశాడు. ఇంతసేపు ఎక్కడికెళ్లావంటూ పిడిగుద్దులు కురిపించాడు.


భార్య అడ్డువచ్చినా వినకుండా భాను ఛాతిపై బలంగా కొట్టాడు. దీంతో బాలుడు అపస్మారకస్థితికి చేరుకున్నాడు. అప్రమత్తమైన కుటుంబసభ్యులు చిన్నారిని హుటాహుటిన చౌటుప్పల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే భాను మృతిచెందినట్లు తెలిపారు. పోస్టుమార్టం అవసరం లేదని చెప్పడంతో పోలీసులకు సమాచారం అందించకుండానే మృతదేహాన్ని కుటుంబసభ్యులకు వైద్యులు అందజేశారు. దీంతో గుట్టుచప్పుడు కాకుండా ఖననం చేసేందురు ప్రయత్నించారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని అంత్యక్రియలను ఆపివేశారు. ఈ నేపథ్యంలో పోలీసులకు బాలుడి బంధువులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. అయితే కన్న తండ్రే కుమారుడిని చంపేశాడని తెలిసి గ్రామస్థులు శోకసంద్రంలో మునిగిపోయారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Gurumurthy Remand Report: గురుమూర్తి రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు.. అందుకే చంపేశాడు

Rangareddy: చిలుకూరు బాలాజీ ఆలయ పూజారిపై దాడి.. సంచలనం రేపుతున్న ఘటన..

Updated Date - Feb 09 , 2025 | 06:04 PM