Nalgonda Assault Journalist: రెచ్చిపోయిన కానిస్టేబుల్ ఫ్యామిలీ.. భవానీ భక్తుడిపై దారుణం
ABN , Publish Date - Oct 01 , 2025 | 01:37 PM
పెద్ద పెద్ద పోలీసు అధికారులకు చెప్పినా ఏం చేయలేరంటూ రెచ్చిపోయింది. తాము పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళమే అంటూ కానిస్టేబుల్ సుపుత్రుడు కూడా రెచ్చిపోయాడు. ఇంతకీ ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.
నల్లగొండ, అక్టోబర్ 1: పట్టణంలో జరిగిన చిన్న తప్పిదం కారణంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఓ విషయంపై ఆర్టీసీ బస్ డ్రైవర్‌పై విజిలెన్స్ కానిస్టేబుల్ కుటుంబ సభ్యులు దాడి చేశారు. బస్సు డ్రైవర్‌ను చితగ్గొట్టారు. ఈ క్రమంలో బస్‌లోనే ఉన్న ఓ జర్నలిస్ట్.. తన వృత్తిపరంగా వీడియో తీశారు. పైగా అతడు భవాని మాత మాల దీక్షలో ఉన్నారు. వీడియో తీయడాన్నిచూసిన కానిస్టేబుల్ భార్య.. దీక్షలో ఉన్నారని కూడా చూడకుండా జర్నలిస్టుపై అసభ్యకరంగా బూతులతో చెలరేగిపోయింది. పెద్ద పెద్ద పోలీసు అధికారులకు చెప్పినా ఏం చేయలేరంటూ రెచ్చిపోయింది. తాము పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళమే అంటూ కానిస్టేబుల్ సుపుత్రుడు కూడా రెచ్చిపోయాడు. ఇంతకీ ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.
హైదరాబాద్ నుంచి నల్లగొండకు వస్తున్న ఆర్టీసీ బస్సు.. క్లాక్ టవర్ సెంటర్‌లో TS05FM0405 కారుకు అనుకోకుండా తగిలింది. ఆ కారు ఓ విజిలెన్స్ కానిస్టేబుల్‌కు చెందింది. దీంతో కానిస్టేబుల్ కుటుంబసభ్యులు మితిమీరి ప్రవర్తించారు. డ్రైవర్‌ను చితకబాదడంతో పాటు భవానీ మాల వేసుకున్న జర్నలిస్టుపై కూడా దుర్భాషలాడారు. దీంతో అక్కడ ఘర్షణ చోటు చేసుకుంది. అయితే భవానీ దీక్షలో ఉన్న వ్యక్తి పట్ల అనుచితంగా ప్రవర్తించడంపై భవానీ భక్తులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సదరు కానిస్టేబుల్‌పై టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో భవానీ భక్తులు ఫిర్యాదు చేశారు. విజిలెన్స్ కానిస్టేబుల్ కుటుంబ సభ్యులపై చర్యలు తీసుకోవాలని భవానీ స్వాములు డిమాండ్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి...
కాస్త నిలకడగా కృష్ణానది.. అయినప్పటికీ
ఏపీలో సుస్థిర పట్టణాభివృద్ధికి సిటీ నెట్ సహకారం
Read Latest Telangana News And Telugu News