Share News

Nalgonda Court: జిల్లా పోక్సో కోర్టు సంచలన తీర్పు..

ABN , Publish Date - Aug 26 , 2025 | 01:51 PM

జిల్లా పోక్సో కోర్టు సంచలన తీర్పునిచ్చింది. పోక్సో కేసులో తిప్పర్తికి చెందిన మహమ్మద్ ఖయ్యూంను దోషిగా తేల్చింది న్యాయస్థానం. నిందితుడికి 51 ఏళ్ల శిక్ష విధిస్తూ న్యాయమూర్తి రోజారమణి తీర్పు వెల్లడించారు.

Nalgonda Court: జిల్లా పోక్సో కోర్టు సంచలన తీర్పు..

నల్లగొండ, ఆగస్టు 26: జిల్లా పోక్సో కోర్టు సంచలన తీర్పునిచ్చింది. పోక్సో కేసులో తిప్పర్తికి చెందిన మహమ్మద్ ఖయ్యూంను దోషిగా తేల్చింది న్యాయస్థానం. నిందితుడికి 51 ఏళ్ల శిక్ష విధిస్తూ న్యాయమూర్తి రోజారమణి తీర్పు వెల్లడించారు. అత్యాచారం కేసులో 20 ఏళ్లు, పోక్సో కేసులో 20 ఏళ్లు, ఎస్సీ ఎస్టీ కేసులో పదేళ్లు, సెక్షన్ 506(మైనర్ బాలికపై బెదిరింపులు) కేసులో మరో ఏడాది శిక్ష విధిస్తూ న్యాయమూర్తి సంచలన తీర్పునిచ్చారు.

నిందితుడు ఖయ్యూం 2021లో తిప్పర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో దళిత మైనర్ బాలికపై అత్యాచారం చేశాడు. ఆపై విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. బాధితురాలు కుటుంబ సభ్యుల సహకారంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు ఖయ్యూంపై రేప్ కేసు నమోదు చేశారు. ఎస్పీ శరత్ చంద్ర పవార్ నేతృత్వంలో న్యాయస్థానానికి సరైన సైంటిఫిక్ ఎవిడెన్స్ సమర్పించడంతో నిందితుడు శిక్ష నుంచి తప్పించుకోలేకపోయాడు.


Also Read:

ప్రాణం తీసిన ప్రేమ.. ఏం జరిగిందంటే..

రెయిన్ అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వానలే.. వానలు

For More Telangana News and Telugu News..

Updated Date - Aug 26 , 2025 | 01:51 PM