Pension Increase: వికలాంగుల పెన్షన్ రూ.6 వేలకు పెంచాలి
ABN , Publish Date - Aug 13 , 2025 | 05:13 AM
రాష్ట్ర ప్రభుత్వం వికలాంగుల పెన్షన్‌ను రూ.4 వేల నుంచి రూ.6 వేలకు పెంచే బాధ్యత తాను తీసుకుంటానని, అలా చేయకపోతే చైర్మన్ పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తానని రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య తెలిపారు.
ఇచ్చిన హామీ నెరవేర్చకపోతే రాజీనామా చేస్తా: వీరయ్య
హైదరాబాద్, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం వికలాంగుల పెన్షన్‌ను రూ.4 వేల నుంచి రూ.6 వేలకు పెంచే బాధ్యత తాను తీసుకుంటానని, అలా చేయకపోతే చైర్మన్ పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తానని రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య తెలిపారు. స్థానిక సంస్థల్లో వికలాంగుల రిజర్వేషన్ల సాధన కమిటీ ఆధ్వర్యంలో సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన రాష్ట్ర సదస్సులో ఆయన మాట్లాడారు. సీఎం రేవంతత్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వికలాంగుల అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేస్తోందన్నారు. 4.83 లక్షల మందికి రూ.200 కోట్ల పెన్షన్ ఇస్తోందని, కేంద్రం ఇవ్వాల్సిన పెన్షన్ విషయంలో మోసం చేస్తోందని ఆరోపించారు.
వికలాంగుల పెన్షన్‌ను కేంద్రం రూ.300 నుంచి రూ.3 వేలకు పెంచే బాధ్యత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు తీసుకోవాలని, లేకపోతే ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాజకీయంగా ఎదగడం కోసం చివరికి వికలాంగులను కూడా వాడుకుంటోందని ఆరోపించారు. రాంచందర్‌రావు, కవిత వికలాంగుల సంక్షేమంపై బహిరంగ చర్చకు రావాలని వీరయ్య సవాల్ విసిరారు.
ఈ వార్తలు కూడా చదవండి..
బీసీ గర్జన సభను మరోసారి వాయిదా వేసిన బీఆర్ఎస్
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. సీఎం చంద్రబాబు కీలక సూచనలు
Read Latest Telangana News And Telugu News