పీసీఐ పాలకమండలి సభ్యుడిగా వెంకటరమణ
ABN , Publish Date - Jun 20 , 2025 | 05:03 AM
ఢిల్లీలోని ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పీసీఐ) కేంద్ర పాలకమండలి సభ్యులుగా హైదరాబాద్‌లోని ఆజాద్ ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ ముప్పవరపు వెంకటరమణ నియమితులయ్యారు.
ఢిల్లీలోని ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పీసీఐ) కేంద్ర పాలకమండలి సభ్యులుగా హైదరాబాద్‌లోని ఆజాద్ ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ ముప్పవరపు వెంకటరమణ నియమితులయ్యారు. అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) తరపు నుంచి ఆయనను పీసీఐ కేంద్ర పాలక మండలి సభ్యుడిగా సిఫారసు చేశారు. ఈ నేపథ్యంలో ఈయనను ఐదేళ్ల కాలానికి పాలకమండలి సభ్యుడిగా నియమిస్తూ గురువారం ఆదేశాలు జారీ అయ్యాయి.
ఈ సందర్భంగా ఆయనకు తెలంగాణ ఫార్మసీ కళాశాల యాజమాన్యాల సంఘం అభినందనలు తెలియజేసింది. సూర్యాపేట జిల్లా కోదాడ ప్రాంతానికి చెందిన వెంకటరమణ అఖిల భారత ఫార్మసీ ఉపాధ్యాయుల సంఘానికి ఉపాధ్యక్షులుగా పనిచేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయతో లోకేష్ భేటీ
యోగాలో ప్రపంచ రికార్డు సృష్టిస్తాం..: మంత్రి సవిత
ఢిల్లీకి బయలుదేరిన సీఎం రేవంత్ రెడ్డి
For More AP News and Telugu News