Share News

పాలన చేతగాక రేవంత్‌ విమర్శలు: రఘునందన్‌

ABN , Publish Date - Mar 03 , 2025 | 04:43 AM

తెలంగాణలో పాలన పడకేసిందని ఎంపీ రఘునందన్‌రావు విమర్శించారు. పాలన చేతగాక సీఎం రేవంత్‌రెడ్డి ప్రతిపక్షాలపై విమర్శలపై చేస్తున్నారని మండిపడ్డారు.

పాలన చేతగాక రేవంత్‌ విమర్శలు: రఘునందన్‌

హైదరాబాద్‌, మార్చి 2 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో పాలన పడకేసిందని ఎంపీ రఘునందన్‌రావు విమర్శించారు. పాలన చేతగాక సీఎం రేవంత్‌రెడ్డి ప్రతిపక్షాలపై విమర్శలపై చేస్తున్నారని మండిపడ్డారు. తమకు, సీఎంకు మధ్య దూరం పెరిగిందంటూ రాష్ట్ర మంత్రులే చెబుతున్నారని పేర్కొన్నారు. ఇటీవల ఢిల్లీ వెళ్లిన రేవంత్‌కు కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ అపాయింట్‌మెంట్‌ ఇవ్వలేదన్నారు. ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. పేరుకు పీసీసీ అధ్యక్ష పదవి బీసీకి ఇచ్చారన్నారు. బీసీలకు సీఎం పదవి ఇవ్వాలని అధిష్ఠానానికి లేఖ రాయాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌ కుమార్‌ గౌడ్‌కు సూచించారు.


మామునూరు విమానాశ్రయం గురించి మాట్లాడే అర్హత కాంగ్రె్‌సకు లేదన్నారు. బీఆర్‌ఎస్‌ నుంచి నుంచి కాంగ్రె్‌సలోకి వచ్చిన ఎమ్మెల్యేలు తిరిగి వెళ్లేందుకు సిద్ధం అవుతున్నారని ఆయన చెప్పారు. వనపర్తిలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడిన తీరు ఆయన వ్యక్తిత్వాన్ని తగ్గించుకొని, సీఎం పీఠాన్ని అవమానించేలా ఉందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్‌ ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డిని వ్యక్తిగతంగా ఏకవచనంతో మాట్లాడటం, దూషించడం సరికాదన్నారు. గతంలో ఇలాంటి భాషను వాడిన కేసీఆర్‌ ఇప్పుడు ఎక్కడ ఉన్నారో గమనించాలన్నారు.

Updated Date - Mar 03 , 2025 | 04:43 AM