MP Chamala: ఎందుకు సీఎం రేవంత్ రెడ్డి మాటల్ని వక్రీకరిస్తున్నారు: ఎంపీ చామల
ABN , Publish Date - Dec 03 , 2025 | 10:42 AM
తెలంగాణ అభివృద్ధిని కాంక్షిస్తూ ఎంతో శ్రమిస్తోన్న సీఎం రేవంత్ రెడ్డికి సహకరించాల్సింది పోయి.. ప్రతీది రాజకీయం చేస్తూ బీజేపీ, బీఆర్ఎస్ నేతలు పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు.
ఢిల్లీ, డిసెంబర్ 3: హైదరాబాద్‌లో నిన్న జరిగిన డీసీసీ నూతన అధ్యక్షుల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటల్ని ఎందుకు వక్రీకరిస్తున్నారని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి నిలదీశారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ప్రతీ విషయాన్నీ రాజకీయం చేసి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నాయని ఆయన మండిపడ్డారు.
హిందువుల్లో అనేక మంది దేవుళ్ళు, దేవతలు ఉన్నారని రేవంత్ రెడ్డి చెప్పారు.. కులాన్ని, మతాన్ని ఇబ్బంది పెట్టే విధంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడలేదని ఎంపీ స్పష్టం చేశారు. దీన్ని బీజేపీ,బీఆర్ఎస్ రెండు పార్టీలు కలిసి రాజకీయం చేస్తున్నాయని విమర్శించారు.
'తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా బీజేపీ, బీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తున్నాయి.. 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ అన్ని ఎన్నికల్లో ఓడిపోయింది. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో బీజేపీకి డిపాజిట్ దక్కలేదు. రేవంత్ రెడ్డి స్థాయిని తగ్గించి తెలంగాణ ప్రజల మనసుల్లో నెగిటివ్ అభిప్రాయాన్ని క్రియేట్ చేయాలని బీజేపీ, బీఆర్ఎస్ ప్రయత్నిస్తున్నాయని.. కాని తెలంగాణ ప్రజలకు వాస్తవాలు తెలుసునని చామల అన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రైజింగ్ 2047 పేరుతో కార్యక్రమాలు చేస్తున్నారు.. మెస్సి లాంటి అంతర్జాతీయ ఫుట్ బాల్ క్రీడాకారుడిని తీసుకువచ్చి హైదరాబాద్ లో ఫుట్ బాల్ మ్యాచ్ ఆడిస్తున్నారని.. ఇదంతా హైదరాబాద్ కీర్తిని ఇనుమడింపచేస్తుందని ఎంపీ చెప్పుకొచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పట్టుబట్టి.. మంజూరు చేయించి...
Read Latest Telangana News and National News