Share News

Nalgonda Court: కన్నబిడ్డ పట్ల దుర్మార్గానికి ఒడిగట్టిన ఆ తల్లికి 20 ఏళ్ల జైలుశిక్ష

ABN , Publish Date - Aug 13 , 2025 | 03:58 AM

మైనర్‌ అయిన తన కుమార్తెను తాను వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేసేందుకు ఆ తల్లి ప్రయత్నించింది.

Nalgonda Court: కన్నబిడ్డ పట్ల దుర్మార్గానికి ఒడిగట్టిన ఆ తల్లికి 20 ఏళ్ల జైలుశిక్ష

  • తాను వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని బాలికపై తల్లి ఒత్తిడి

  • అంగీకరించనందుకు ఆమెపై దాడి

  • తీర్పు వెలువరించిన నల్లగొండ న్యాయస్థానం

నల్లగొండ క్రైం, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతిప్రతినిధి): మైనర్‌ అయిన తన కుమార్తెను తాను వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేసేందుకు ఆ తల్లి ప్రయత్నించింది. ఇందుకు అంగీకరించలేదనే కోపంతో ఆ బిడ్డపై విచక్షణారహితంగా దాడి చేసింది. కుమార్తెను అభ్యంతరకర రీతిలో వీడియోలు తీసేందుకు తన ప్రియుడిని ప్రోత్సహించింది. రెండేళ్ల క్రితం నల్లగొండలో వెలుగుచూసిన ఈ ఘటనకు సంబంధించిన కేసులో నల్లగొండ కోర్టు న్యాయమూర్తి రోజారమణి మంగళవారం తీర్పు వెలువరించారు. బాలిక తల్లికి 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.5వేల జరిమానా విధించారు. లైన్‌వాడకు చెందిన గ్యారాల శివకుమార్‌కు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. అతడు పట్టణ పరిధిలోని ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆ మహిళ కూతురుపై కన్నేసి.. ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. ఇందుకు ఆ బాలిక నిరాకరించింది.


అతడినే పెళ్లి చేసుకోవాలని బిడ్డను తల్లి ఒత్తిడి చేసింది. పెళ్లికి ఒప్పించేందుకు శివ కుమార్‌తో బాలికను అభ్యంతరకర రీతిలో వీడియోలు తీయించింది. బాధితురాలైన బాలిక.. బంధువులతో కలిసి 2023 మే 8న పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు సాక్ష్యాలను సేకరించారు. కాగా మరికొద్దిసేపట్లో తీర్పు వెలువడనుందనగా నిందితుడు శివకుమార్‌ పరారయ్యాడు. బాధితురాలి తల్లిని, శివకుమార్‌ను పోలీసులు మంగళవారం కోర్టుకు తీసుకొచ్చారు. నిందితుడు మరుగుదొడ్డికి వెళ్లొస్తానని చెప్పి వెళ్లి.. కోర్టు ఆవరణ నుంచి తప్పించుకున్నాడు. ఏ-1గా ఉన్న శివకుమార్‌పై కోర్టు నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. మళ్లీ అతడిని పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టిన రోజే శిక్షను ప్రకటిస్తారు. ఏ-2గా ఉన్న బాలిక తల్లికి పోక్సో చట్టం ప్రకారం 20 ఏళ్ల కఠిన జైలు శిక్ష, రూ.5వేల జరిమానా, బాల్య వివాహ నిషేధ చట్టంలోని సెక్షన్‌ 10 ప్రకారం మరో రెండేళ్ల జైలు శిక్ష విధించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

బీసీ గర్జన సభను మరోసారి వాయిదా వేసిన బీఆర్ఎస్

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. సీఎం చంద్రబాబు కీలక సూచనలు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Aug 13 , 2025 | 03:58 AM