Share News

Early Monsoon: ముందస్తు ఖరీఫ్‌ సాగు పదేళ్లలో ఇదే మొదటి సారి

ABN , Publish Date - May 29 , 2025 | 04:51 AM

సాధారణంగా ప్రతియేటా జూన్‌ మొదటివారంలో రాష్ట్రంలోకి ప్రవేశించే నైరుతి రుతుపవనాలు ఈసారి ముందే ఎంటరయ్యాయి.

Early Monsoon: ముందస్తు ఖరీఫ్‌ సాగు పదేళ్లలో ఇదే మొదటి సారి

  • పలు చోట్ల పత్తి విత్తనాలేసిన రైతులు

  • ఈ సారి 1.35 కోట్ల ఎకరాల్లో సాగు

  • వ్యవసాయశాఖ అంచనా

హైదరాబాద్‌, మే28 (ఆంధ్రజ్యోతి): సాధారణంగా ప్రతియేటా జూన్‌ మొదటివారంలో రాష్ట్రంలోకి ప్రవేశించే నైరుతి రుతుపవనాలు ఈసారి ముందే ఎంటరయ్యాయి. ఈ నెల 26న నైరుతి రుతుపవనాలు ప్రవేశించగా, 27న రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిశాయి. నైరుతి రుతుపవనాలు ప్రవేశించిన వారం రోజులకు రైతులు వివిధ పంటల విత్తనాలు వేస్తారు. సాధారణంగా తెలంగాణలో తొలకరి వర్షాలు జూన్‌ 8-10 తేదీల మధ్య కురుస్తాయి. ఈసారి ఈ నెల 26 నుంచే తొలకరి వర్షాలు మొదలు కావడం.. గత పదేళ్లలో ముందస్తుగా వచ్చిన వర్షాకాలమని వాతావరణ శాస్త్రవ్తేత్తలు చెప్పారు. 2023లో జూన్‌ ఐదో తేదీన, 2024లో జూన్‌ మూడో తేదీన తెలంగాణలో తొలకరి వర్షం కురిసింది.


ఈ సారి తొలి 2 రోజుల్లోనే సాధారణ స్థాయిని మించి వర్షపాతం నమోదు కావడంతో ఖరీఫ్‌ సీజన్‌లో పంటల సాగుకు అన్నదాతలు సమాయత్తమవుతున్నారు. అడపాదడపా కురిసిన వర్షాలతో దుక్కులు దున్ని పంట భూములను సాగుకు సిద్ధం చేసిన రైతులు.. వివిధ పంటల విత్తనాలు విత్తేందుకు సిద్ధమయ్యారు. ఇటీవలే కొన్ని చోట్ల పత్తి విత్తనాలు నాటిన రైతులు.. మిగతా ప్రాంతాల్లో శ్రీకారం చుట్టారు. ఈ ఏడాది వానాకాలం సీజన్‌లో 1.35కోట్ల ఎకరాల్లో పంటలు సాగవుతాయని వ్యవసాయశాఖ ఖరీఫ్‌ ప్రణాళికలో పేర్కొంది. వరి, పత్తి, మొక్కజొన్న, సోయాబీన్‌, మినుములు, పెసళ్లు, వేరుశనగ, ఆముదం, నువ్వులు సాగు చేస్తారని తెలిపింది.


Also Read:

వావ్.. రైలు పట్టాల మీద జేసీబీ

రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్

తెలంగాణ హైకోర్టు కొత్త సీజే ఎవరంటే

For More Telangana News and Telugu News..

Updated Date - May 30 , 2025 | 03:02 PM