ఒక్క రోజే ఈఎన్‌సీగా
ABN , Publish Date - Jun 01 , 2025 | 03:28 AM
నీటి పారుదల శాఖలో ఈఎన్‌సీ(ఇంజనీర్ ఇన్ చీఫ్)గా పూర్తి అదనపు బాధ్యతలు స్వీకరించిన ఓ అధికారి.. సాయంత్రానికల్లా పదవీ విరమణ చేశారు. సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్(సీడీవో) చీఫ్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న వి.మోహన్‌కుమార్ నిబంధనల ప్రకారం ఈఎన్‌సీగా పదోన్నతిని అందుకోవాల్సి ఉంది.
నియామకం జరిగిన నాడే పదవీ విరమణ
ఒకే రోజు ఏడుగురు అధికారులు రిటైర్
హైదరాబాద్, మే 31 (ఆంధ్రజ్యోతి): నీటి పారుదల శాఖలో ఈఎన్‌సీ(ఇంజనీర్ ఇన్ చీఫ్)గా పూర్తి అదనపు బాధ్యతలు స్వీకరించిన ఓ అధికారి.. సాయంత్రానికల్లా పదవీ విరమణ చేశారు. సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్(సీడీవో) చీఫ్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న వి.మోహన్‌కుమార్ నిబంధనల ప్రకారం ఈఎన్‌సీగా పదోన్నతిని అందుకోవాల్సి ఉంది. చాలా రోజుల కిందటే ఆయన పదోన్నతికి అర్హత సాధించారు. అయితే కాళేశ్వరం ప్రాజెక్టు కేసులో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ పలువురు అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సిఫారసు చేయడంతో శాఖలో పదోన్నతుల ప్రక్రియ ఆగిపోయింది.
అయితే శనివారం పదవీ విరమణ చేయనున్న మోహన్‌కుమార్‌కు సీడీవో విభాగం ఈఎన్‌సీగా పూర్తి అదనపు బాధ్యతలు కట్టబెడుతూ నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి రాహుల్ బొజ్జా ఉత్తర్వులు ఇచ్చారు. కాగా, ఆయనతోపాటు ఎస్‌ఈలు రంగారెడ్డి, ఏసయ్య, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు యాదగిరి, రవీందర్‌రావు, దయాకర్‌రెడ్డి, డీఈఈ రవీందర్ పదవీ విరమణ చేశారు. హైడ్రాలజీ విభాగంలో ఎస్‌ఈగా పనిచేస్తున్న కాశీ విశ్వనాథంను సీడీవో సీఈగా నియమించారు. ఈఈ జహీర్‌ను సీడీవో ఎస్‌ఈగా నియమించారు. మెదక్ ఎస్‌ఈగా ఎస్.వెంకటేశ్వర్‌రావు, చేవెళ్ల ఎస్‌ఈగా మధుసూదన్‌రెడ్డి, మహాదేవ్‌పూర్ ఈఈగా సి.హెచ్.తిరుపతిరావు, ఎల్‌ఎండీ కాలనీ ఎస్‌ఈగా నాగభూషణ్‌రావు, సీఈసీడీవోలో ఈఈగా రామసుబ్బారెడ్డికి పూర్తి అదనపు బాధ్యతలప్పగించారు.
ఈ వార్తలు కూడా చదవండి
jagtyaala : పాఠ్య పుస్తకాలు వస్తున్నాయి..
Crime News: తెలంగాణ భవన్ నుంచి సైబర్ నేరస్తుడు పరారీ..
TG News: ఢీకొన్న రెండు కార్లు.. ఆ తర్వాత ఏమైందంటే..
Indigo Flight Delay: ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య
Read Latest Telangana News And Telugu News