Share News

Raja Singh: కేటీఆర్‌.. జైలుకు ఇవి తీసుకెళ్లండి

ABN , Publish Date - Jan 17 , 2025 | 03:19 AM

‘‘కర్మ ఎవరినీ వదిలిపెట్టదు. ఎవరినీ మర్చిపోదు. సరైన సమయం కోసం వేచిచూస్తుంది’’ అని ఎమ్మెల్యే రాజాసింగ్‌ మాజీ మంత్రి కేటీఆర్‌ను ఉద్దేశించి ట్వీట్‌ చేశారు.

Raja Singh: కేటీఆర్‌.. జైలుకు ఇవి తీసుకెళ్లండి

  • 4 జతల దుస్తులు, దుప్పటి పట్టుకెళ్లండి

  • క్లీన్‌ ఇమేజ్‌ కొనసాగించడానికి సబ్బు అవసరం

  • మాజీ మంత్రిని ఉద్దేశించి ఎమ్మెల్యే రాజాసింగ్‌ ట్వీట్‌

హైదరాబాద్‌ సిటీ, జనవరి 16(ఆంధ్రజ్యోతి): ‘‘కర్మ ఎవరినీ వదిలిపెట్టదు. ఎవరినీ మర్చిపోదు. సరైన సమయం కోసం వేచిచూస్తుంది’’ అని ఎమ్మెల్యే రాజాసింగ్‌ మాజీ మంత్రి కేటీఆర్‌ను ఉద్దేశించి ట్వీట్‌ చేశారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాలు తనపై తప్పుడు కేసులు పెట్టి గతంలో జైలుకు పంపాయని పేర్కొన్నారు. ఇతరులే లక్ష్యంగా అధికారాన్ని దుర్వినియోగం చేసేవారు చివరకు అనుభవించక తప్పదన్నారు. ‘‘కేటీఆర్‌ జీ.. జైలుకెళ్లే ముందు సర్దుకోవాల్సిన వస్తువులతో చిన్న చెక్‌ లిస్ట్‌ పెడుతున్నా. కటకటాల వెనుక ఆధునికంగా ఉండాలి కదా? అందుకు 4 జతల దుస్తులు తీసుకెళ్లండి.


జైల్లో హాయిగా ఉండదు కాబట్టి దుప్పటి, పరిశుభ్రత ముఖ్యం కనుక టవల్‌ పట్టుకెళ్లండి. నన్ను నమ్మండి.. భావోద్వేగాలు ఉప్పొంగుతాయి. దానికోసం రుమాలు ఉంచుకోండి. క్లీన్‌ ఇమేజ్‌ కొనసాగించడానికి సబ్బు అవసరం. జైలు భోజనం ఫైవ్‌స్టార్‌ కాదు. అందుకని ప్యాకెట్‌ ఊరగాయ, చలికాలంలో వెచ్చదనం కోసం స్వెటర్‌ మర్చిపోవద్దు’’ అంటూ రాజాసింగ్‌ పోస్ట్‌ చేశారు.

Updated Date - Jan 17 , 2025 | 03:19 AM