Medipalli Satyam: 72 నిమిషాల్లోనైనా చర్చకు రెడీ
ABN , Publish Date - Jul 06 , 2025 | 04:29 AM
రైతుల కోసం ప్రభుత్వం ఏం చేసిందో చర్చించే అంశంలో కేటీఆర్ విసిరిన సవాలుకు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తీవ్రస్థాయిలో స్పందించారు.
అసెంబ్లీకి కేసీఆర్‌ను తీసుకురా: ఎమ్మెల్యే మేడిపల్లి
హైదరాబాద్, జూలై 5 (ఆంధ్రజ్యోతి): రైతుల కోసం ప్రభుత్వం ఏం చేసిందో చర్చించే అంశంలో కేటీఆర్ విసిరిన సవాలుకు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తీవ్రస్థాయిలో స్పందించారు. 72 గంటలు కాదు.. 72 నిమిషాల్లోనైనా తాము చర్చకు సిద్ధమని స్పష్టం చేశారు. సిరిసిల్ల, చింతమడక, తెలంగాణ భవన్, ప్రెస్‌క్లబ్ ఎక్కడికైనా వస్తామని పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశాలు పెట్టాలని స్పీకర్‌కు లేఖ రాసి.. ప్రభుత్వ పనితీరుపై చర్చించేందుకు ప్రతిపక్ష నేత కేసీఆర్‌ను సభకు తీసుకురావాలని కేటీఆర్‌ను సవాలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రిని ఆడిపోసుకోవడం కేటీఆర్‌కు పనిగా మారిందని, ఆయన మాటల్లో అక్కసు, కుళ్లు తప్ప మరేం ఉండవని అన్నారు. ప్రభుత్వ పని తీరుపై బహిరంగ చర్చకు తాము ఎప్పుడైనా సిద్ధమేనని స్పష్టం చేశారు
ఓటరు జాబితా నుంచి మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని పేరు తొలగింపు
వేములవాడ/హైదరాబాద్, జూలై 5 (ఆంధ్రజ్యోతి): వేములవాడ మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ నాయకుడు చెన్నమనేని రమేశ్ పేరును ఓటరు జాబితా నుంచి తొలగించారు. ఈ మేరకు వేములవాడ నియోజకవర్గ ఎన్నికల రిజిస్ట్రేషన్ అధికారి, వేములవాడ ఆర్డీవో రాధాబాయి ఉత్తర్వులు జారీ చేశారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన ఓ రాజకీయ నాయకుని పేరును ఓటరు జాబితా నుంచి తొలగించడం దేశంలోనే మొదటిసారి కావడం గమనార్హం.. వేములవాడ ప్రస్తుత ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత చెన్నమనేని భారత పౌరుడే కాదంటూ కొద్దిరోజుల కిందే హైకోర్టు తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే చెన్నమనేని పేరును ఓటరు జాబితా నుంచి తొలగించాలంటూ ఆది శ్రీనివాస్ అధికారులకు వినతిపత్రం సమర్పించారు. దీనిపై అధికారులు ఇచ్చిన నోటీసులకు నిర్ణీత గడువులోగా చెన్నమనేని సమాధానమివ్వకపోవడంతో ఓటరు జాబితా నుంచి పేరు తొలగిస్తూ ఆయన ఇంటి గేటుకు తాజాగా నోటీసు అంటించారు.
ఇవి కూడా చదవండి
తిరుపతికి వెళ్లేందుకు గూగుల్‌ను నమ్మారు.. తీరా చూస్తే
మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ముందుకు: డిప్యూటీ సీఎం భట్టి
Read Latest Telangana News And Telugu News