Share News

Seethakka: జువెనైల్‌ హోంలు పరివర్తన కేంద్రాలు

ABN , Publish Date - Aug 22 , 2025 | 04:10 AM

జువెనైల్‌ హోంలు పరివర్తన కేంద్రాలని, ఇక్కడ ఉండే బాలలు సత్ప్రవర్తనతో బయటకు వెళ్లి ఉన్నత పౌరులుగా ఎదగాలని మంత్రి సీతక్క అన్నారు.

Seethakka: జువెనైల్‌ హోంలు పరివర్తన కేంద్రాలు

  • బాలలు ఉన్నత పౌరులుగా ఎదగాలి: సీతక్క

హైదరాబాద్‌/సైదాబాద్‌, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి): జువెనైల్‌ హోంలు పరివర్తన కేంద్రాలని, ఇక్కడ ఉండే బాలలు సత్ప్రవర్తనతో బయటకు వెళ్లి ఉన్నత పౌరులుగా ఎదగాలని మంత్రి సీతక్క అన్నారు. గురువారం సైదాబాద్‌లోని జువెనైల్‌ హోంను మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క సందర్శించారు. ఇక్కడ హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌ 9వ తరగతి విద్యార్థిని ఆకర్షణ ఏర్పాటు చేసిన గ్రంథాలయాన్ని ఆమె ప్రారంభించి మాట్లాడారు. చిన్నారులు క్షణికావేశంలో తప్పులు చేయకుండా సన్మార్గంలో నడవాలని సూచించారు. రాష్ట్రంలో మరో ఐదు అబ్జర్వేషన్‌ హోంల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు.


నేటి నుంచి పల్లెల్లో పనుల జాతర

పల్లెల్లో ఉపాధి కల్పనతోపాటు వివిధ రంగాల్లో అభివృద్ధికి శుక్రవారం నుంచి పల్లెల్లో పనుల జాతర కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని మంత్రి సీతక్క ప్రకటించారు. పనుల జాతర పోస్టర్‌ను మంత్రి అడ్లూరి లక్షణ్‌తో కలిసి ఆమె గురువారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం ద్వారా రూ.2,199కోట్లతో 1,01,589 పనులను చేపట్టనున్నామని చెప్పారు. వచ్చేఏడాది జనవరిలో జరిగే మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు ప్రభుత్వం రూ.150కోట్లు విడుదల చేసిందని చెప్పారు. కాగా, మంత్రి కొండా సురేఖతో తనకు ఎలాంటి విభేదాల్లేవని సీతక్క స్పష్టం చేశారు. సమ్మక్క, సారలమ్మలా తాము అక్కాచెల్లెళ్లలా సఖ్యతతో ఉన్నామన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఎమ్మెల్యేలు ఇలా చేస్తే ఎలా.. సీఎం చంద్రబాబు ఫైర్

టీటీడీపై వైసీపీ బురద జల్లుతోంది.. జ్యోతుల నెహ్రూ ధ్వజం

Read Latest AP News and National News

Updated Date - Aug 22 , 2025 | 04:10 AM