Minister Jupally: బతుకమ్మ ప్రాముఖ్యతను లోకానికి చాటిచెబుదాం
ABN , Publish Date - Sep 18 , 2025 | 08:22 AM
తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన బతుకమ్మ ప్రాముఖ్యత, ప్రాశస్య్తం, మహిళల ఐక్యతను, ప్రకృతి సౌందర్యం ఔన్నత్యాని ప్రపంచానికి తెలియజేసేలా కవులు, కళాకారులు, గాయకులు రచనలు, ప్రదర్శనలు చేయాలని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు.
- మంత్రి జూపల్లి కృష్ణారావు
హైదరాబాద్: తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన బతుకమ్మ ప్రాముఖ్యత, ప్రాశస్య్తం, మహిళల ఐక్యతను, ప్రకృతి సౌందర్యం ఔన్నత్యాని ప్రపంచానికి తెలియజేసేలా కవులు, కళాకారులు, గాయకులు రచనలు, ప్రదర్శనలు చేయాలని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు(Minister Jupally Krishna Rao) పిలుపునిచ్చారు. బుధవారం టూరిజం ప్లాజాలో కవులు, కళాకారులు, గేయ రచయితలు, గాయకులు, సాంస్కృతిక సలహా మండలి సభ్యులు తదితరులతో మంత్రి జూపల్లి సమావేశమై బతుకమ్మ పండుగ సందర్భంగా ప్రభుత్వ ఏర్పాట్లను వివరించారు.

సమావేశంలో ప్రొఫెసర్ కోదాండరాం(Kodandaram), వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ సభ్యురాలు భవానిరెడ్డి, స్టేట్ ఆర్ట్ గ్యాలరీ డైరెక్టర్ లక్ష్మి, ప్రముఖ దర్శకులు నర్సింగరావు, సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ, సాంస్కృతిక సలహా మండలి సభ్యులు, కవులు, కళాకారులు, జానపద గాయకులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు..ఏ నగరాల్లో ఎలా ఉన్నాయంటే
Read Latest Telangana News and National News